MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkee0f33a894-091a-41b2-b9fa-7d59171f6852-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkee0f33a894-091a-41b2-b9fa-7d59171f6852-415x250-IndiaHerald.jpgవెంకటేష్ ప్రముఖ నిర్మాత డి రామానాయుడి తనయుడు. ఆయన స్టార్ ప్రొడ్యూసర్ అవుతాడు అనుకుంటే స్టార్ హీరో అయ్యాడు. అయితే వెంకటేష్ కి మంచి జడ్జినెంట్ ఉంది. అంతే కాదు తరాల అభిరుచుల మీద మంచి అవగాహన‌ ఉంది. ఇక కాలంతో పాటు తానూ మారాలని ఆయన ఆలోచిస్తారు venkee{#}anil ravipudi;Venkatesh;Success;Hero;Cinema;producer;Producerఆ విషయంలో వెంకటేష్ ని మెచ్చుకోవాల్సిందే... ?ఆ విషయంలో వెంకటేష్ ని మెచ్చుకోవాల్సిందే... ?venkee{#}anil ravipudi;Venkatesh;Success;Hero;Cinema;producer;ProducerWed, 11 Aug 2021 19:01:52 GMTవెంకటేష్ ప్రముఖ నిర్మాత డి రామానాయుడి తనయుడు. ఆయన స్టార్ ప్రొడ్యూసర్ అవుతాడు అనుకుంటే స్టార్ హీరో అయ్యాడు. అయితే వెంకటేష్ కి మంచి జడ్జినెంట్ ఉంది. అంతే కాదు తరాల అభిరుచుల మీద మంచి అవగాహన‌ ఉంది.

ఇక కాలంతో పాటు తానూ మారాలని ఆయన ఆలోచిస్తారు. వెంకీ సహనటులు అంతా అరవైలు దాటిన వారే. అయితే అందరూ కూడా హీరోయిన్లతో ఇంకా డ్యూయట్లు పాడాలనే అనుకుంటున్నారు. కానీ వెంకీ మాత్రం తన పాత్ర బాగుంటే చాలు అని ఆలోచిస్తారు. అందుకే ఆయన ముగ్గురు బిడ్డల తండ్రిగా వయసు మీరిన పాత్రను లేటెస్ట్ మూవీ నారప్పలో పోషించారు. నిజంగా మిగిలిన హీరోలు ఎవరూ అలాంటి పాత్ర పోషిస్తారా అంటే జవాబు చెప్పడం డౌటే.

ఈ మూవీతోనే కాదు, దృశ్యం సినిమాలో కూడా వెంకీ టీనేజ్ కూతురుతో పాటు మరో ఆడపిల్లకు తండ్రిగా నటించారు. అక్కడ వెంకీనే జనాలు చూశారు. ఆ మూవీ చేయడం వల్ల ఆయన ఇమేజ్ మరింతగా పెరిగింది తప్ప ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు. ఇక వెంకీ వెరైటీ ఆఫ్ రోల్స్ కోసం చూస్తారు. అలాగే కాలంతో పాటే తానూ అంటారు. మారుతున్న జనాల అభిరుచిని గుర్తించి తనను తాను మెరుగులు దిద్దుకోవడానికి ఆయన చూస్తారు. అందుకే ఆయనకు మంచి సక్సెస్ రేటు ఉంది. ఆయన సినిమాలు వచ్చి ఇప్పటికి పాతిక ముప్పయ్యేళ్ళు అయినా కూడా ఈ రోజుకీ ఫ్రెష్ గా ఉంటాయి. టీవీలలో వస్తే వాటి రేటింగ్ కూడా బాగుంటుంది. ఇక నారప్పతో తాజాగా హిట్ కొట్టిన వెంకీ మరిన్ని మంచి పాత్రల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎపుడూ విక్టరీ కొడుతూనే ఉంటారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్ త్రీ మూవీ చేస్తున్న వెంకీ తన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 75వ మూవీ కొసం భారీ కసరత్తునే చేస్తున్నారు.







హాట్ బ్యూటీతో రొమాన్స్ కి రెడీ అయిన మెగా హీరో..?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>