PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kaushik-reddy76656f71-e51c-4824-94f7-7d3010ea8a61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kaushik-reddy76656f71-e51c-4824-94f7-7d3010ea8a61-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ ని వదిలి టీఆర్ఎస్ లో చేరిన హుజూరాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు కేసీఆర్. గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే అది ఆచరణలోకి వచ్చిందా. అసలు గవర్నర్ కి ప్రపోజల్స్ వెళ్లాయా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు అనే వార్తలు రావడానికి రెండ్రోజుల ముందే.. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ససేమిరా అన్నారు. కరోనా కాలంలో ఇలాంటి ఎన్నికలు జరిపే అవకాశం లేదని చెప్పారు. అదే సమయంలో కౌశిక్ రెడ్డికి మాత్రం ఎమkaushik reddy{#}Akkineni Nagarjuna;kaushik;Elections;MLA;Governor;Backward Classes;Success;Congress;News;KCR;Telangana Rashtra Samithi TRS;Party;Coronavirus;local languageకౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. కండిషన్స్ అప్లై..కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. కండిషన్స్ అప్లై..kaushik reddy{#}Akkineni Nagarjuna;kaushik;Elections;MLA;Governor;Backward Classes;Success;Congress;News;KCR;Telangana Rashtra Samithi TRS;Party;Coronavirus;local languageWed, 11 Aug 2021 10:00:00 GMTకాంగ్రెస్ ని వదిలి టీఆర్ఎస్ లో చేరిన హుజూరాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు కేసీఆర్. గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే అది ఆచరణలోకి వచ్చిందా. అసలు గవర్నర్ కి ప్రపోజల్స్ వెళ్లాయా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు అనే వార్తలు రావడానికి రెండ్రోజుల ముందే.. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ససేమిరా అన్నారు. కరోనా కాలంలో ఇలాంటి ఎన్నికలు జరిపే అవకాశం లేదని చెప్పారు. అదే సమయంలో కౌశిక్ రెడ్డికి మాత్రం ఎమ్మెల్సీ ఖాయమనే వార్తలొచ్చాయి.

ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులు, ముఖ్యులకు ఇచ్చిన హామీలకోసం ఎమ్మెల్సీ సీట్లను వాడుకుంటాయి పార్టీలు. కేసీఆర్ కూడా ఇలాగే ఎమ్మెల్సీ ఆఫర్లు చాలామందికే ఇచ్చారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యవహారం మాత్రం అన్నిటికీ భిన్నంగా సాగింది. ఇలా కాంగ్రెస్ లోనుంచి అలా టీఆర్ఎస్ లో చేరడం, ఆ వెంటనే ఎమ్మెల్సీ ప్రచారం అన్నీ చకచకా జరిగిపోయాయి.

వాస్తవానికి హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి అవుతారని అనుకున్నారంతా. కానీ ఈటల బీసీ కావడం, ఇటీవలే దళిత బంధు ప్రకటించడంతో.. కౌశిక్ అభ్యర్థిత్వం డైలమాలో పడింది. ఈటలను ఎదుర్కోవాలంటే మరో బీసీ నేతనో లేక, దళిత వర్గానికి చెందినవారినో బరిలో దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల విషయంలో కూడా ఇలానే చివరి వరకూ మంతనాలు జరిపి సక్సెస్ అయ్యారు. అయితే హుజూరాబాద్ విషయంలో మాత్రం ముందుగానే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇవ్వడం ఆశ్చర్యంగా మారింది.

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వార్తలతో చాలామంది టీఆర్ఎస్ నేతలు నొచ్చుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారిని కాదని, కాంగ్రెస్ నుంచి పార్టీలోకొచ్చిన రోజుల వ్యవధిలోనే ఆయనకు పట్టం కట్టాలనుకోవడం చాలామందికి రుచించలేదు. దీంతో కేసీఆర్ కి నేరుగానే తమ అభ్యంతరాలను తెలిపారట. అలా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు కాస్తా కేవలం హామీగానే మిగిలిపోయిందని అంటున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపుకోసం కౌశిక్ రెడ్డి కష్టపడితే, ఆ కష్టానికి విజయం రూపంలో ఫలితం దక్కితే, అప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఖాయం చేస్తారట. మొత్తమ్మీద ఖాయం అనుకున్న ఎమ్మెల్సీ పోస్ట్ ఇలా హుజూరాబాద్ గెలుపుతో ముడిపడిపోయింది.



సరదాగా స్నానం చేస్తున్న వీడియో తీసింది.. కాబోయే భర్తకు పంపబోయి. మరొకరికి..!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>