Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh7d91f68c-2558-4f60-846e-ff93e09e574e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh7d91f68c-2558-4f60-846e-ff93e09e574e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాత్రమే కాకుండా యావత్ భారత సినీమా ప్రపంచం ఎదురుచూస్తున్న సూపర్ మల్టీస్టారర్ మూవీ అయిన 'ఆర్ఆర్ఆర్'పై ఎలాంటి అంచనాలు రూపొందాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను తిరగరాయాలని భారీ ప్లాన్ వేస్తున్నాడట దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తుండటంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. కాగా ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తోనే భారీ క్రేజ్ లాగేసిన జక్కన్న, ఈ సినిమాతో ఎవరMahesh{#}Pawan Kalyan;Alluri Sitarama Raju;RRR Movie;Audience;Graphics;Romantic;Alluri Seetha Rama Raju;Rajamouli;ram pothineni;Bahubali;Cinema;NewsRRR సినిమా టెన్షన్ లో మహేష్ ఫాన్స్?RRR సినిమా టెన్షన్ లో మహేష్ ఫాన్స్?Mahesh{#}Pawan Kalyan;Alluri Sitarama Raju;RRR Movie;Audience;Graphics;Romantic;Alluri Seetha Rama Raju;Rajamouli;ram pothineni;Bahubali;Cinema;NewsWed, 11 Aug 2021 23:03:00 GMTటాలీవుడ్ మాత్రమే కాకుండా యావత్ భారత సినీమా ప్రపంచం ఎదురుచూస్తున్న సూపర్ మల్టీస్టారర్ మూవీ అయిన 'ఆర్ఆర్ఆర్'పై ఎలాంటి అంచనాలు రూపొందాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను తిరగరాయాలని భారీ ప్లాన్ వేస్తున్నాడట దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తుండటంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. కాగా ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తోనే  భారీ క్రేజ్ లాగేసిన జక్కన్న, ఈ సినిమాతో ఎవరికీ అస్సలు సాధ్యం కానీ మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడని సమాచారం.

ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథను ఊహత్మక రూపంలో చూపించి సూపర్ అనిపించాలని జక్కన్న తెగ కష్టపడుతున్నాడని సమాచారం.ఇందులో ఎన్టీఆర్‌తో కొమురం భీం పాత్రను చేయిస్తుండగా, రామ్ చరణ్‌తో అల్లూరి సీతారామరాజు పాత్రను చేయిస్తున్నాడు రాజమౌళి. నిజానికి ఈ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అస్సలు ఎప్పుడు కలుసుకోలేదు. కానీ వారిని కలిపితే ఎలా ఉంటుందని మనకు చూపించే  భారీ ప్రయత్నమే ఆర్ఆర్ఆర్ అంటున్నాడట ఈ రాజమౌళి. ఇంతవరకు వినడానికి బాగానే ఉన్నా, ఎందుకో సినిమాను వేరే కోణంలో చూసేవారికి ఈ సినిమా కొంచం తేడానే కొడుతుందని వార్తలు వినిపిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు చేసే పోరాటాలు అప్పట్లో ఆ స్థాయిలో అస్సలు జరిగినవి కావని కొంత మంది వాదన.ఇక భారీ గ్రాఫిక్స్ వాడి మరీ యుద్ధ సన్నివేశాలు చూపించాల్సిన అవసరం ఏంటని కొంత మంది వాదిస్తున్నారట . అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ గురించి కొందరు విమర్శకులు అప్పుడే కామెంట్ చేయడం మొదలు పెట్టారు.కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల ప్రేమకథలు రాజమౌళి ఎలా చిత్రీకరిస్తాడు అని వారు చాలా ఎదురుచూస్తున్నారట.ఏదేమైనా వీటిలో ఏ ఒక్క అంశం కూడా ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రభావం చూపితే ఏమిటి పరిస్థితి అని వారు అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ చిత్రంలో కొత్తదనం అస్సలు ఏమీ లేకపోతే సాధారణ ప్రేక్షకులు ఏవిధంగా ఈ సినిమాను  ఆదరిస్తారనేది కూడా ముఖ్యమైన అంశం.

ఇదిలా ఉంటే rrr సినిమా విషయంలో మహేష్ అభిమానులు టెన్సన్ పడుతున్నారట. ఈ సినిమా బాహుబలి స్థాయి చేరుకోకపోయినా ఆ స్థాయి విజయం సాదించాలి లేకపోతే సినిమాకు నెగటివ్ టాక్ వస్తుందని వారి అనుమానం. నెగటివ్ టాక్ వస్తే ఈ సినిమా ప్రభావం రాజమౌళి తరువాత మహేష్ తీయబోయే సినిమాపై పడుతుందని మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారట. rrr హిట్ అయితే రాజమౌళి తరువాత చేయబోయే సినిమాకు భారీ క్రేజ్ ఉంటుందని వారు ఆశ పడుతున్నారట.మహేష్ అభిమానుల ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.



హుజూరాబాద్ పోరు: 'కారు' కొంపముంచనున్న కాంగ్రెస్?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>