PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/ktr-talk-behind6b2738e7-4a4f-44a6-82c0-479e330caa7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/ktr-talk-behind6b2738e7-4a4f-44a6-82c0-479e330caa7e-415x250-IndiaHerald.jpgఏ రాష్ట్రానికైనా, ప్రభుత్వానికైనా పరిస్థితులను బట్టి ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు తాజాగా ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పాలి. తెలంగాణ దశ దిశ మార్చే సత్తా వ్యవసాయ రంగానికే ఉంది అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారంనాడు జరిగిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే- గతంలో నిktr talk behind{#}swetha;Telangana Chief Minister;Aqua;Telangana;Reddy;Minister;CM;Government;Cinemaవ్యవసాయంపై కేటీఆర్‌ కొత్త పల్లవికి కారణం అదేనా?వ్యవసాయంపై కేటీఆర్‌ కొత్త పల్లవికి కారణం అదేనా?ktr talk behind{#}swetha;Telangana Chief Minister;Aqua;Telangana;Reddy;Minister;CM;Government;CinemaWed, 11 Aug 2021 13:02:00 GMTఏ రాష్ట్రానికైనా, ప్రభుత్వానికైనా పరిస్థితులను బట్టి ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు తాజాగా ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పాలి. తెలంగాణ దశ దిశ మార్చే సత్తా వ్యవసాయ రంగానికే ఉంది అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారంనాడు జరిగిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే- గతంలో నిర్బంధ వ్యవసాయం అమలు చేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ప్రభుత్వం చెప్పిన పంటనే రైతులు వేయాలి. అయితే నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్బంధ వ్యవసాయం గురించి చెప్పడంతో.. అది సాధ్యమేనా? అన్న చర్చ అప్పుడు జోరుగానే జరిగింది. స్వయానా రైతు అయిన సీఎం కేసీఆర్‌ నిర్బంధ వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్బంధ వ్యవసాయం అమలుకు కేసీఆర్‌ సర్కారు అంతగా ఆసక్తి చూపలేదనే చెప్పాలి.

ఇదిలావుంటే, ఇప్పుడు తెలంగాణలో నాలుగు రకాల విప్లవాలు ప్రారంభమయ్యాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వ్యవసాయంలో హరిత విప్లవం, మత్స్య పరిశ్రమలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్‌ విప్లవం, పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం మొదలైందని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిజానికి వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా సమావేశం అయింది. వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, నూతన విధానాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. రాష్ట్రంలో వ్యవసాయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం స్వయం సమృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధితో వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతమిచ్చేలా, రైతులను ఉత్సాహపరిచేలా మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారనీ, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఆయన ఆలోచనా విధానం ఉందన్న చర్చ జరుగుతోంది.

అయితే గతంలో వర్షాభావ పరిస్థితులకు తోడు నీటి ప్రాజెక్టుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో.. నాడు సీఎం కేసీఆర్‌ నిర్బంధ వ్యవసాయం సాగులో వస్తున్న నష్టానికి సరైన పరిష్కార మార్గంగా భావించారట. అందుకే అప్పుడు ప్రభుత్వం చెప్పిన పంట వేయాలని ఆయన చెప్పారనీ, ఇప్పుడా సాగునీరు సమస్య చాలావరకు తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందనీ వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ఇటీవల వ్యవసాయం ప్రధాన ఇతివృత్తింగా వచ్చిన శ్రీకారం సినిమా కేటీఆర్‌ను ప్రభావితం చేసిందనీ, అందుకే తెలంగాణ దిశ మార్చే సత్తా వ్యవసాయానికి ఉందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారనీ టాక్.



కథ ఒకటే.. ఒకేరోజు విడుదల..వెంకీ హిట్‌... బాల‌య్య ఫ‌ట్ ?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>