PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ganga39daa8d3-e736-4185-ae8d-a5d799f371a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ganga39daa8d3-e736-4185-ae8d-a5d799f371a2-415x250-IndiaHerald.jpgపవిత్ర గంగా నది ఉగ్రరూపం దాల్చింది. వారణాసి తీరంలో ప్రవహిస్తోన్న గంగమ్మ... వేల మందిని నిరాశ్రయులుగా మార్చేసింది. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద నీరు వస్తుండటంతో.. వారణాసిలో గంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవేశిస్తోంది. ఇప్పటికే గంగ ఒడ్డున వారణాసి ఘాట్ లపై నివసిస్తున్న వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు గంగ స్నానం చేయకుండా అధికారులు ఆంక్షలు విధించారు కూడా. గంగా నది సమీపంలోని ప్రధానమైన నాలుగు ఘాట్లు మినహా మిగిలినవన్నీ అధికారులు మూసేశారు. వారణGanga{#}Manikarnika;Ganga;Ganges;Kasi;Prime Minister;Narendra Modi;Aquaమోదీ నియోజకవర్గంలో అలజడి..?మోదీ నియోజకవర్గంలో అలజడి..?Ganga{#}Manikarnika;Ganga;Ganges;Kasi;Prime Minister;Narendra Modi;AquaWed, 11 Aug 2021 17:53:23 GMTపవిత్ర గంగా నది ఉగ్రరూపం దాల్చింది. వారణాసి తీరంలో ప్రవహిస్తోన్న గంగమ్మ... వేల మందిని నిరాశ్రయులుగా మార్చేసింది. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద నీరు వస్తుండటంతో.. వారణాసిలో గంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవేశిస్తోంది. ఇప్పటికే గంగ ఒడ్డున వారణాసి ఘాట్ లపై నివసిస్తున్న వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు గంగ స్నానం చేయకుండా అధికారులు ఆంక్షలు విధించారు కూడా. గంగా నది సమీపంలోని ప్రధానమైన నాలుగు ఘాట్లు మినహా మిగిలినవన్నీ అధికారులు మూసేశారు. వారణాసిలోని లోతట్టు ప్రాంతాల్లో చాలా కాలనీల్లోకి నీరు చేరడంతో.. వీధుల్లో బోట్లు వేసుకుని సహాయ చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

గంగా నదిలో నీటి ప్రవాహం ఇప్పటికే ప్రమాదకర స్థాయి దాటి గంగా నది ప్రవహిస్తోంది. అదే సమయంలో ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం ఎక్కువగా వస్తోంది కూడా. గంగ, వరుణ నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో... ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారణాసి వాసులకు ఆహారం, ఇతర సహాయాన్ని కూడా అధికారులు బోట్లు ద్వారా అందిస్తున్నారు. వరద నీటికి గంగా ఘాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మణికర్ణిక ఘాటు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో వారణాసిలో అంత్యక్రియలు నిర్వహణకు అంతరాయం కలిగింది. ఘాటులో అంత్యక్రియలను నిలిపివేశారు. ఇక హరిశ్చంద్ర ఘాట్ లో జరగాల్సిన క్రియలను రోడ్డుపై నిర్వహిస్తున్నారు. ఘాట్ లో అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. గంగా, వరుణ నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వారణాసిలో గంగా నది 71.74 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. తన సొంత నియోజవర్గం వారణాసిలో వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ విపత్తు నివారణ అధికారులకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని... అలాగే గంగా పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనా వేయాలని మోదీ సూచించారు.





మెగా బర్తడే కి సంపూ సర్ప్రైస్..

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>