PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/tagore-absent-reasonebb6c333-4bd0-4747-8487-849bc44af4bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/tagore-absent-reasonebb6c333-4bd0-4747-8487-849bc44af4bb-415x250-IndiaHerald.jpgదళిత బంధుకు కౌంటర్‌గా టీపీసీసీ చేపట్టిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభ గ్రాండ్ సక్సెస్ అయింది. తల ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో అన్నట్లుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసి ప్రకటించిన సభకు అంచనాలకు మించి జనాలు హాజరయ్యారు. దీంతో ఇంద్రవెల్లి అడవులు దండుకట్టి తరలివచ్చిన జనాలతో కిక్కిరిసి పోయాయి. కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ వేసిన దండోరాతో కొండలు మారుమోగాయి. రేవంత్ టిపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి సభకు అటు పార్టీలోని అసంతృప్త నేతలు కూడా హాజరై ఐక్యత సంTagore absent reason{#}TPCC;Success;District;MP;Revanth Reddy;revanth;Congress;KCR;Partyదళిత దండోరా సభకు ఠాగూర్‌ డుమ్మా అందుకేనా?దళిత దండోరా సభకు ఠాగూర్‌ డుమ్మా అందుకేనా?Tagore absent reason{#}TPCC;Success;District;MP;Revanth Reddy;revanth;Congress;KCR;PartyWed, 11 Aug 2021 15:37:00 GMTదళిత బంధుకు కౌంటర్‌గా టీపీసీసీ చేపట్టిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభ గ్రాండ్ సక్సెస్ అయింది. తల ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో అన్నట్లుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసి ప్రకటించిన సభకు అంచనాలకు మించి జనాలు హాజరయ్యారు. దీంతో ఇంద్రవెల్లి అడవులు దండుకట్టి తరలివచ్చిన జనాలతో కిక్కిరిసి పోయాయి. కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ వేసిన దండోరాతో కొండలు మారుమోగాయి. రేవంత్ టిపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి సభకు అటు పార్టీలోని అసంతృప్త నేతలు కూడా హాజరై ఐక్యత సంకేతాలు పంపించారు. అయితే టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభకు ఏఐసీసీ ఇంచార్జి మానిక్కం ఠాగూర్ హాజరవ్వకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. కీలక కార్యక్రమానికి ఎందుకు డుమ్మా కొట్టారన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది.

రేవంత్ రెడ్డికి ఇన్‌ఛార్జి ఠాగూర్ సన్నిహితుడనే టాక్ ఉంది. కొందరు సీనియర్లు వ్యతిరేకించినా పట్టుబట్టి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇప్పించడంలో ఇన్‌చార్జ్‌ కీలక పాత్ర పోషించారని చెబుతారు. ఆ విషయంలో ఠాగూర్ ఓ వర్గం నేతలకు విలన్‌గా మారిపోయారు కూడా. జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవల్ లీడర్లు అందరితో సంప్రదించి మెజారిటీ అభిప్రాయం మేరకు రేవంత్‌కు పగ్గాలు ఇవ్వాలని అధినేత్రి సోనియాను ఒప్పించి ఇప్పించారనే చర్చ ఉంది. మరి అంతటి నమ్మకాన్ని పెట్టిన ఆయన రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ఇంద్రవెల్లి సభకు రాకపోవడం సొంత పార్టీ నేతలను సైతం ఆశ్చర్యా నికి గురిచేస్తోంది.

పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందునే ఇంద్రవెల్లి సభకు అటెండ్ కాలేదని ఎంపీ ఠాగూర్‌ ప్రకటన విడుదల చేశారు. అయితే ఠాగూర్ రాకపోవడానికి అదొక్కటే కారణం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  ఉన్నప్పుడు రైతు భరోసా పాదయాత్ర చేపట్టారు. కొంగర కలాన్‌లో  ముగింపు సభ పెట్టారు. దానికి కూడా ఠాగూర్ దూరంగా ఉన్నారు. తెలంగాణలోనే ఉండి కూడా రేవంత్ పాదయాత్ర ముగింపు సభకు డుమ్మా కొట్టారు. అది అప్పట్లో చర్చనీయాంశం అయింది.



సీమ ప్రాంతంలో కేఆర్ఎంబీ పర్యటన

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>