PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-e29c02cb-6a7d-48b0-a713-4120ba966f6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-e29c02cb-6a7d-48b0-a713-4120ba966f6b-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ అట్రాక్షన్ ఏదీ అంటే అంతా చెప్పే మాట హుజురాబాద్. టీఆర్ఎస్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల... భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈటల... ఆ తర్వాత శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో కాలు పెట్టారు. నాటి నుంచే అధికార పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గం మొత్తం ఇప్పటికే పాదయాత్ర చేస్తున్నారు కూడా. అటు హుజురాHuzurabad{#}Telugu Desam Party;Telangana Chief Minister;Kumaar;Eatala Rajendar;రాజీనామా;kaushik;Minister;Bharatiya Janata Party;Huzurabad;Telangana Rashtra Samithi TRS;KCR;srinivas;Y. S. Rajasekhara Reddy;Congress;Party;Governmentరసవత్తరంగా హుజురాబాద్రసవత్తరంగా హుజురాబాద్Huzurabad{#}Telugu Desam Party;Telangana Chief Minister;Kumaar;Eatala Rajendar;రాజీనామా;kaushik;Minister;Bharatiya Janata Party;Huzurabad;Telangana Rashtra Samithi TRS;KCR;srinivas;Y. S. Rajasekhara Reddy;Congress;Party;GovernmentWed, 11 Aug 2021 13:03:00 GMTతెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ అట్రాక్షన్ ఏదీ అంటే అంతా చెప్పే మాట హుజురాబాద్. టీఆర్ఎస్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల... భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈటల... ఆ తర్వాత శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో కాలు పెట్టారు. నాటి నుంచే అధికార పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గం మొత్తం ఇప్పటికే పాదయాత్ర చేస్తున్నారు కూడా.

అటు హుజురాబాద్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా... తొలి నుంచి ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసింది. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్ పైనే కత్తులు దూశాడంటూ మంత్రుల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఈటలపై మాటల తూటాలు పేల్చారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేశారు కూడా. ప్రభుత్వం ప్రతష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న కౌశిక్ రెడ్డిని తమవైపు తిప్పుకుని... ఏకంగా ఎమ్మెల్యీ పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ తర్వాత బీజేపీ నుంచి పెద్దిరెడ్డిని, తెలుగుదేశం నుంచి ఎల్.రమణను కారెక్కించారు కేసీఆర్.

ఇప్పుడు అనూహ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును పార్టీ అధికారికంగా ప్రకటించింది. అటు బీజేపీ తరఫున ఈటల రాజేందర్ లేదా జమునారెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం... ఇప్పటి వరకు తమ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. అటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇక తాజాగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అసలు ఉప ఎన్నిక ప్రకటన రాకముందే ఇంతటి హైప్ క్రియేట్ అవ్వడం కూడా ఓ హిస్టరీనే మరి.





కథ ఒకటే.. ఒకేరోజు విడుదల..వెంకీ హిట్‌... బాల‌య్య ఫ‌ట్ ?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>