BreakingN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-mp-arvanind-on-trs-mpsb86bf790-6c5f-4369-905d-2dadd2d1d5fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-mp-arvanind-on-trs-mpsb86bf790-6c5f-4369-905d-2dadd2d1d5fc-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పార్లమెంట్‌ సభ్యులకు స్వేచ్ఛ లేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్‌ విమర్శించారు. కనీసం టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు కూడా ఆ పార్టీ ఎంలకు అపాయింట్‌మెంట్‌ దొరకదని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరితే మంచిదన్నారు. కోళ్ల ఫారాల కోసం మొక్క జొన్న దిగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని అడిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు బీజేపీ ఎంపీ అరవింద్‌. తెలంగాణ రాష్ట్రంలోనేbjp mp arvanind on trs mps{#}kaleshwaram;Corn;MP;Ishtam;central government;Letter;CM;Telangana;Telangana Chief Minister;Bharatiya Janata Party;KCR;Party;Coronavirusటీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌bjp mp arvanind on trs mps{#}kaleshwaram;Corn;MP;Ishtam;central government;Letter;CM;Telangana;Telangana Chief Minister;Bharatiya Janata Party;KCR;Party;CoronavirusWed, 11 Aug 2021 14:00:10 GMTతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పార్లమెంట్‌ సభ్యులకు స్వేచ్ఛ లేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్‌ విమర్శించారు. కనీసం టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు కూడా ఆ పార్టీ ఎంలకు అపాయింట్‌మెంట్‌ దొరకదని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరితే మంచిదన్నారు. కోళ్ల ఫారాల కోసం మొక్క జొన్న దిగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని అడిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు బీజేపీ ఎంపీ అరవింద్‌. తెలంగాణ రాష్ట్రంలోనే మొక్క జొన్న ఉత్పత్తి మిగులు నిల్వలు విపరీతంగా ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారనీ, అలాంటప్పుడు మొక్క జొన్న దిగుమతికి అవకాశం కల్పించాలని కేంద్రాన్ని అడగడం దేనికి? అని అరవింద్‌ ప్రశ్నించారు. దీన్నిబట్టి టీఆర్ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ను కలిసి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి, నియోజకవర్గానికి ఏది కావాలో అది సమకూర్చుకునే పరిస్థితి లేదా? అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. ఇక సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావడం ఇష్టం లేదని ఎంపీ అరవింద్‌ ఆరోపించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐలకు వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదని కూడా ఆయన ఫైర్‌ అయ్యారు. ఎన్‌ఆర్‌ఐల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐల కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ౨౮ రోజులు కాగానే కొవిషీల్డ్‌ తీసుకునే అవకాశం ఇచ్చిందన్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐలకు వ్యాక్సిన్‌ త్వరితగతిన వ్యాక్సిన్‌ వేసుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన పట్టించుకోవడం లేదని అరవింద్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కరోనా టీకా తొలి డోసు వేయడాన్ని పునఃప్రారంభించిన క్రమంలో.. ఎన్‌ఆర్‌ఐలకు కూడావ్యాక్సిన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ ఎంపీ అరవింద్‌ కోరారు.



టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>