MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi96356084-36b2-44f8-a246-e1caf13bdc13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi96356084-36b2-44f8-a246-e1caf13bdc13-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సుస్వాగతం' సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన ఈ నటుడు. రవితేజ హీరోగా నటించిన పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆంజనేయులు' సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ తర్వాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్, గబ్బర్ సింగ్ అనే సినిమాలను నిర్మించాడు. ఈ రెండు సినిమాలలో 'గబ్బర్ సింగ్' సChiranjeevi{#}bandla ganesh;Gabbar Singh;Govindudu Andarivadele;ravi teja;Josh;Ravi;Blockbuster hit;producer;Producer;Varsham;kalyan;media;Ram Charan Teja;NTR;Allu Arjun;Hero;Chiranjeevi;Cinemaచిరంజీవి పై పొగడ్తలు వర్షం కురిపించిన బండ్లగణేష్..!చిరంజీవి పై పొగడ్తలు వర్షం కురిపించిన బండ్లగణేష్..!Chiranjeevi{#}bandla ganesh;Gabbar Singh;Govindudu Andarivadele;ravi teja;Josh;Ravi;Blockbuster hit;producer;Producer;Varsham;kalyan;media;Ram Charan Teja;NTR;Allu Arjun;Hero;Chiranjeevi;CinemaWed, 11 Aug 2021 13:08:00 GMTతెలుగు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సుస్వాగతం' సినిమాలో  హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన ఈ నటుడు. రవితేజ హీరోగా నటించిన పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆంజనేయులు' సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ తర్వాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్,  గబ్బర్ సింగ్ అనే సినిమాలను నిర్మించాడు. ఈ రెండు సినిమాలలో 'గబ్బర్ సింగ్' సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చిన జోష్ లోనే ఎన్టీఆర్ తో బాదుషా, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే అనే సినిమాలు నిర్మించి తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు.

ప్రస్తుతం ఈ స్టార్ ప్రొడ్యూసర్ సినిమాల పరంగా కొంచెం స్లో అయ్యాడనే చెప్పవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బండ్ల గణేష్ చాలా ఆక్టివ్ గా ఉంటాడు. ఎవరికి ఏదైనా సమస్య వచ్చింది అని తనకు తెలిసినట్లు అయితే వెంటనే స్పందిస్తూ ఉంటాడు. అలాగే ఇతర విషయాలపై కూడా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమాభిమానాలు కురిపించే బండ్ల గణేష్ అప్పుడప్పుడు ఇతర హీరోల మీద కూడా తన అభిమానాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తాజాగా చిరంజీవిపై కూడా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం కురిపించాడు. తాజాగా కొన్ని చిరంజీవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించి బండ్ల గణేష్ మా దేవరకి అన్న..అందరికీ నేను అనే నమ్మకం..మనిషి అంటే ఇలా ఉండాలి అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న మెగాస్టార్ అంటూ చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీ లను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. తాజాగా చిరంజీవి ని ఉద్దేశించి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతుంది.



టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>