PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/eetala-headache-in-bjp9058be58-c159-4d71-a6c9-b85dc310a141-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/eetala-headache-in-bjp9058be58-c159-4d71-a6c9-b85dc310a141-415x250-IndiaHerald.jpgతెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్‌ను వీడిన తర్వాత బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసిన నాయకులు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం వైపు కన్నెత్తి చూడకపోవటం చర్చనీయాంశం అవుతోంది. కేంద్రంలో కీలక పదవిలో ఉన్న నేత ఈటలను బీజేపీలో తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈటల బీజేపీలో చేరే వరకు తన సన్నిహితుల ద్వారా రాయభారం నడిపిన ఆ కీలక నేత ముఖం చాటేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటల పార్టీలో చేరిన తర్వాత కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు మాత్రమే ఆయన ఈటలతో eetala headache in bjp{#}Chintala Ramachandra Reddy;Amit Shah;central government;District;Huzurabad;Minister;Partyబీజేపీలో ఈటలకు తలనొప్పులు షురూ!?బీజేపీలో ఈటలకు తలనొప్పులు షురూ!?eetala headache in bjp{#}Chintala Ramachandra Reddy;Amit Shah;central government;District;Huzurabad;Minister;PartyWed, 11 Aug 2021 15:53:00 GMTతెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్‌ను వీడిన తర్వాత బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసిన నాయకులు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం వైపు కన్నెత్తి చూడకపోవటం చర్చనీయాంశం అవుతోంది. కేంద్రంలో కీలక పదవిలో ఉన్న నేత ఈటలను బీజేపీలో తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈటల బీజేపీలో చేరే వరకు తన సన్నిహితుల ద్వారా రాయభారం నడిపిన ఆ కీలక నేత ముఖం చాటేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటల పార్టీలో చేరిన తర్వాత  కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు మాత్రమే ఆయన ఈటలతో ఉన్నారట. ఆ తర్వాత ఆ ముఖ్యనేత ఈటల వ్యవహారంలో అంటీముట్టనట్లు ఉంటున్నారన్న చర్చ బీజేపీలో సాగుతోంది. దీంతో ఆ కీలక నాయకుడి తీరు ఈటల సన్నిహితులకు రుచించడం లేదని సమాచారం.

ఈటల ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి సొంత జిల్లాకు చెందిన జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు, జిల్లా స్థాయి నేతలు కూడా ప్రచారానికి దూరంగా ఉండటం పార్టీలో చర్చకు తావిస్తోంది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన జాతీయ నేత, మధ్యప్రదేశ్‌ ఇంఛార్జ్‌ మురళీధరరావు హుజురాబాద్‌కు ఒక్కసారి కూడా ఎందుకు వెళ్లడం లేదన్న చర్చ మొదలైంది. సీనియర్ నేత రామకృష్ణారెడ్డి లాంటి నేతలు సైతం  అక్కడ అడుగుపెట్టడం లేదని పార్టీలో విన్పిస్తోంది. మరోవైపు తమ‌కు పోటీ అవుతాడన్న కారణంతో పార్టీలోని చాలా మంది సీనియర్లు ఈటలకు మద్దతుగా ప్రచారం చేయటానికి ఇష్టపడడం లేదని సమాచారం.

ఇక పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఈటల రాజేందర్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రమే ఈటల పాదయాత్రకు మద్దతుగా నిలిచారు.జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  ఈటల పాదయాత్రలో ఒక్క రోజు పాల్గొని వచ్చారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న లక్ష్మణ్, రాంచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి లాంటి నేతలు హుజూరాబాద్ వెళ్లటానికి సుముఖత చూపడం లేదన్న చర్చ పార్టీలో సాగుతోంది.





ఆ విషయంలో వెంకటేష్ ని మెచ్చుకోవాల్సిందే... ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>