MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr7de1eead-22f5-429b-96b3-f87caa9b1bc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr7de1eead-22f5-429b-96b3-f87caa9b1bc7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ వారసులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, అలానే ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ తో పాటు కొద్దిరోజుల క్రితం విడుదలైన దోస్తీ సాంగ్ కూడా ఎంతో ఆకట్టుకుని ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు తారా స్థాయికి పెరిగాయి. దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ భారీ పేట్రియాటిక్ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బrrr movie{#}Ajay Devgn;Alia Bhatt;m m keeravani;January;Hollywood;dvv entertainment;sai madhav burra;October;K K Senthil Kumar;Olivia Morris;Ram Charan Teja;India;Coronavirus;Ukraine;NTR;RRR Movie;Audience;Rajamouli;Cinema'ఆర్ఆర్ఆర్' : మళ్ళీ నెత్తిన బండేయరు కదా ..... ??'ఆర్ఆర్ఆర్' : మళ్ళీ నెత్తిన బండేయరు కదా ..... ??rrr movie{#}Ajay Devgn;Alia Bhatt;m m keeravani;January;Hollywood;dvv entertainment;sai madhav burra;October;K K Senthil Kumar;Olivia Morris;Ram Charan Teja;India;Coronavirus;Ukraine;NTR;RRR Movie;Audience;Rajamouli;CinemaWed, 11 Aug 2021 23:58:00 GMTటాలీవుడ్ స్టార్ వారసులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, అలానే ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ తో పాటు కొద్దిరోజుల క్రితం విడుదలైన దోస్తీ సాంగ్ కూడా ఎంతో ఆకట్టుకుని ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు తారా స్థాయికి పెరిగాయి. దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ భారీ పేట్రియాటిక్ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని, సాయి మాధవ్ బుర్రా మాటలని, అలానే ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తుండడం విశేషం.

ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తుండగా స్కాట్, లేడీ స్కాట్ పాత్రల్లో హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రియ, సముద్రఖని, అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ చాలావరకు షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లుగా కొద్దిరోజుల క్రితం యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా థియేటర్స్ తెరుచుకోకపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అందరూ నిర్మాతలతో పాటు ఆర్ఆర్ఆర్ దర్శకనిర్మాతల మనసులో కూడా థర్డ్ వేవ్ భయం వెంటాడుతోందని, అందుకే సినిమాని వచ్చే ఏడాది జనవరి లాస్ట్ వారానికి వాయిదా వేసేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పటికే పలు మార్లు వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ, మరొక్కసారి వాయిదా తో మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రేక్షకాభిమానుల నెత్తిన బండ వేయదు కదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్త పై పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు ...!!



హుజూరాబాద్ పోరు: 'కారు' కొంపముంచనున్న కాంగ్రెస్?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>