స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సస్పెంట్.. ఎందుకంటే..
భారత రెజ్లింగ్ సమాఖ్య స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఒలింపిక్స్‌లో క్రమశిక్షణారహిత్యానికి యాక్షన్ తీసుకుంది. తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నామని డబ్యూఎఫ్ఐ పేర్కొంది. మూడు అంశాలపై ఫెడరేషన్ నోటీసులు జారీచేసింది. ఆయా అంశాలపై ఈ నెల 16వ తేదీ వరకు సమాధానం ఇవ్వాలని స్పష్టంచేసింది.

బెలారస్ వనేసాతో ఓడిపోయిన తర్వాత ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించడం.. ఒలింపిక్స్ గ్రామంలో ఎందుకు ఉండలేదు, జట్టు స్పాన్సర్ లోగోతో రెజ్లింగ్ సింగిల్ ధరించలేదు అని అడిగింది. స్పాన్సర్ నైట్ లోగో సింగిల్‌ట్‌లో పోటీకి దిగడంపై ప్రశ్నించింది. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు వినేష్ ట్వీట్ చేశారు. దానిని ఫెడరేషన్ సీరియస్‌గా తీసుకుంది.
తనతోపాటు ఇతర అథ్లెట్లకు ఫిజియోథెరపిస్ట్ అనుమతించలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక అథ్లెట్‌కు చాలా మంది కోచ్ ఉన్నప్పుడు.. నలుగురు మహిళ రెజ్లర్ల కోసం ఒక ఫిజియోథెరపిస్ట్ అడగడం నేరమా అని ట్వీట్ చేశారు. అంతేకాదు.. హంగేరి నుంచి టోక్యో వెళ్లిన సమయంలో కూడా గది కేటాయింపు విషయంలో వినేశ్ గొడవకు దిగారని తెలుస్తోంది.