MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevid5180e7f-06bf-41f5-a701-03d7d9d818d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevid5180e7f-06bf-41f5-a701-03d7d9d818d4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో గ‌త కొన్ని రోజులుగా `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్‌) ఎన్నిక‌ల ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతూ వ‌స్తున్న సంగ‌తి విదిత‌మే. అయితే రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో మెగాస్టార్ నేరుగా లేఖ‌తో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నిక‌ల‌ను వెంట‌నే నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ `మా` క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి పెద్ద‌గా ఉన్న కృష్ణం రాజుకు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. ఇన్ని రోజులు తెర వెనుక ఉండి వ్య‌వ‌హారాల్ని న‌డిపించే చిరు ఇప్పుడు డైరెక్టుగా సీన్‌లోకి రావ‌డానికి కార‌ణ‌మేమిట‌ని ప్ర‌శ్న‌లు నెల‌కొంటున్నాయి. అయితే ఎవ‌రెనchiranjeevi{#}AdiNarayanaReddy;Episode;Audio;hema;Letter;Chiranjeevi`మా` ర‌చ్చ‌లోకి చిరు డైరెక్ట్ ఎంట్రీకి కార‌ణ‌మేమిటీ..?`మా` ర‌చ్చ‌లోకి చిరు డైరెక్ట్ ఎంట్రీకి కార‌ణ‌మేమిటీ..?chiranjeevi{#}AdiNarayanaReddy;Episode;Audio;hema;Letter;ChiranjeeviTue, 10 Aug 2021 10:58:27 GMT టాలీవుడ్‌లో గ‌త కొన్ని రోజులుగా `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్‌) ఎన్నిక‌ల ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతూ వ‌స్తున్న సంగ‌తి విదిత‌మే. అయితే రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో మెగాస్టార్ నేరుగా లేఖ‌తో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నిక‌ల‌ను వెంట‌నే నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ `మా` క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి పెద్ద‌గా ఉన్న కృష్ణం రాజుకు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. ఇన్ని రోజులు తెర వెనుక ఉండి వ్య‌వ‌హారాల్ని న‌డిపించే చిరు ఇప్పుడు డైరెక్టుగా సీన్‌లోకి రావ‌డానికి కార‌ణ‌మేమిట‌ని ప్ర‌శ్న‌లు నెల‌కొంటున్నాయి. అయితే ఎవ‌రెన్ని చెప్పిన మా లో ఆధిప‌త్యం కొన‌సాగించేది చిరంజీవి అనే విష‌యం అంద‌రికి తెలిసిందే.

 

 రెండేళ్ల క్రితం జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా న‌రేష్ గెలిచిన విష‌యం విధిత‌మే. పోలింగ్ వేళ చిరంజివీ వెంట న‌రేష్ చిరంజీవి పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి వెళ్లేంత వ‌ర‌కు ఆయ‌న వెంట‌నే ఉన్నాడు. ఓట్లు వేసిన త‌రువాత అంద‌రు బాగా ప‌ని చేయండి అని చెప్పి పెద్ద త‌నాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఇప్పుడు స్వ‌యంగా చిరు లేఖ రాసి సీన్‌లోకి రావ‌డంతో ప‌లువురు విస్మ‌యానికి గుర‌వుతున్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరుతూ న‌టి హేమ విడుద‌ల చేసిన ఆడియో టేపులో ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా ఉన్న న‌రేష్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకు ఆయ‌న ఘాటుగా స‌మాధానం కూడా ఇచ్చారు.  దీంతో క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీలో ముఖ్య‌మైన కృష్ణం రాజుకు చిరు లేఖ రాయడం వ‌ల్ల ఎన్నిక‌ల‌ను జాప్యం చేయ‌డం మంచిది కాద‌న్న సంకేతాల‌ను ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.


  అయితే, ఆది నుంచి `మా` లో తెర‌వెనుక ఉండి చిరంజీవి పావులు క‌దుపుతార‌నే ప్ర‌చారం ఉండేది. అందుకు భిన్నంగా చిరు తాన‌కు తానుగా లేఖ రాయ‌కుండా ఉండాల్సింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. బాస్ పెద్ద‌త‌నంగా హుందాగా వ్య‌వ‌హ‌రించి ఉండాల్సి ఉందని ప‌లువురు అనుకుంటున్నారు.  లేఖ రాయ‌డానికి ఎంత మంది లేరు వారిలో ఎవ‌రో ఒక‌రు ఈ వివాదంపై రియాక్ట్ అయ్యుండేవార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు `మా ` ఎన్నిక‌ల్లో నెల‌కొన్న వివాదాల‌కు పుల్‌స్టాప్ పెట్టేందుకే మెగాస్టార్ ఈ లేఖ‌ను రాసి ఉండొచ్చ‌ని సిని వ‌ర్గాలు అనుకుంటున్నారు. సినిమాటిక్ ఏ మాత్రం తీసిపోని ఈ మా ఎల‌క్ష‌న్స్ ఏ మ‌లుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.






సంక్రాంతి విన్నర్ ఆ సినిమానే అంటున్న అభిమానులు

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>