HealthN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/viral-fevers-in-agency2a204455-aacc-4b26-8b56-e1e5388a5702-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/viral-fevers-in-agency2a204455-aacc-4b26-8b56-e1e5388a5702-415x250-IndiaHerald.jpgఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం సీజనల్‌ వ్యాధులతో వణికిపోతోంది. విషజ్వరాలు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి. ములుగు ఏజన్సీ ప్రాంతంలో ఆదివాసీ గూడాలు మంచం పట్టాయి. ఇంటికో జ్వరపీడితుడితో ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు ఆదివాసి గూడాలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. అటువైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు. వర్షాలతో దోమలు అధికమవుతున్నాయి. దోమ కాటుతో విషజ్వరాల పీడిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. సీజనల్‌ వ్యాధులతో మన్యం విలవిల్లాడుతున్న జిల్లా వైద్యాధికారులు కన్నెత్తి చూడటం లేదన్న విమరviral fevers in agency{#}Warangal;village;Mahabubabad;Bhupalpally;Mulugu;Dengue;mosquitos;District;Coronavirus;Governmentమన్యంలో విషజ్వరాల విజృంభణమన్యంలో విషజ్వరాల విజృంభణviral fevers in agency{#}Warangal;village;Mahabubabad;Bhupalpally;Mulugu;Dengue;mosquitos;District;Coronavirus;GovernmentTue, 10 Aug 2021 08:44:00 GMTఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం సీజనల్‌ వ్యాధులతో వణికిపోతోంది. విషజ్వరాలు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి. ములుగు ఏజన్సీ ప్రాంతంలో ఆదివాసీ గూడాలు మంచం పట్టాయి. ఇంటికో జ్వరపీడితుడితో ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు ఆదివాసి గూడాలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. అటువైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు. వర్షాలతో దోమలు అధికమవుతున్నాయి. దోమ కాటుతో విషజ్వరాల పీడిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. సీజనల్‌ వ్యాధులతో మన్యం విలవిల్లాడుతున్న జిల్లా వైద్యాధికారులు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని అటవీ గ్రామాలు, మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ మండలాల్లో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. మంగపేట ఏజెన్సీలో జ్వరాల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఏ గ్రామం చూసినా ఆదివాసీలు వైరల్‌ ఫీవర్లతో బాధపడుతూ కనిపిస్తున్నారు. మలేరియా, టైపాయిడ్‌ బారిన పడుతున్నవారు అధికంగా ఉన్నారు. విష జ్వరాల బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడంతో డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు పలువురు ఆందోళన చెందుతున్నారు.

కరోనా మహమ్మారి భయంతో గిరిజనులు ఇంటి వద్దనే వైద్యం చేయించుకుంటున్నారు. పనుల కాలంలో అనారోగ్యం బారినపడడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వైద్యాధికారులు ఆదివాసీ గూడాలవైపు కన్నెత్తి చూడడం లేదు. దోమతెరలు కొన్నిచోట్ల పంపిణీ చేసినా... చాలా ఆదివాసీ గూడాలకు అవి అందలేదు. దీంతో అధికశాతం దోమకాటుతోనే వ్యాధులు సోకుతున్నాయి. దోమల మందులు పిచికారీ చేయాల్సి ఉన్నా... అధికారులు పట్టించుకోలేదు. అటవీ గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అధికారులు ముందస్తుగా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో  ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

ఇప్పుడు ఆదివాసీ గూడాలకు ఆర్ఎంపీ వైద్యులే శరణ్యమయ్యారు. వారు చేసిందే వైద్యమన్నట్టుగా మారింది పరిస్థితి. ఎంత పెద్ద జబ్బుచేసినా... ఆర్ఎంపీలు ఇచ్చిన మందు బిల్లులతోనే సరిపెట్టుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఆదివాసీ జనం. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఈ తరుణంలో వైద్య శిబిరాల జాడ కన్పించడం లేదు. ఆదివాసీ పల్లెల్లో ఇంటికొకరు, ఇద్దరు జ్వరపీడితులు, సీజనల్ వ్యాధుల పీడితులు ఉన్నారు. ఇక్కడికి కనీసం ఆరోగ్య కార్యకర్తలు కూడా రావడం లేదు. ఉన్న కొద్ది మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా సర్వేలో ఉన్నారు. దీంతో ఏజన్సీ పల్లెల్లో వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా మారుమూల పల్లె ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం కన్పిస్తోంది.



అనంతలో స్పందన ఏదీ?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>