PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/same-scene-repeat-in-ttdcfcc04bc-2279-4541-8de8-63b109e4f941-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/same-scene-repeat-in-ttdcfcc04bc-2279-4541-8de8-63b109e4f941-415x250-IndiaHerald.jpgతిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి కొలువుదీరడంలో సేమ్‌ సీన్‌ రిపీట్‌ కానుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోమారు పాలక మండలి సభ్యుల నియామకం ఆలస్యం కానుంది. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా రెండోసారి నియామకమైన వైవీ సుబ్బారెడ్డి మాత్రమే తొలుత ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతనే పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. వైవీ సుబ్బారెడ్డి తొలిసారి టీటీడీ ఛైర్మన్‌గా ఎన్నికైనప్పుడు కూడా ఇదే తంతు కొనసాగింది. అప్పుడు ఆయన బాధ్యతలు తీసుకున్న మూడు నెలల తర్వాత పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారsame scene repeat in ttd{#}yv subbareddy;Y V Subbareddy;Tirumala Tirupathi Devasthanam;Tirupati;YCP;Governmentటీటీడీలో సేమ్‌ సీన్‌ రిపీట్‌!టీటీడీలో సేమ్‌ సీన్‌ రిపీట్‌!same scene repeat in ttd{#}yv subbareddy;Y V Subbareddy;Tirumala Tirupathi Devasthanam;Tirupati;YCP;GovernmentTue, 10 Aug 2021 07:54:08 GMTతిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి కొలువుదీరడంలో సేమ్‌ సీన్‌ రిపీట్‌ కానుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోమారు పాలక మండలి సభ్యుల నియామకం ఆలస్యం కానుంది. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా రెండోసారి నియామకమైన వైవీ సుబ్బారెడ్డి మాత్రమే తొలుత ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతనే పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. వైవీ సుబ్బారెడ్డి తొలిసారి టీటీడీ ఛైర్మన్‌గా ఎన్నికైనప్పుడు కూడా ఇదే తంతు కొనసాగింది. అప్పుడు ఆయన బాధ్యతలు తీసుకున్న మూడు నెలల తర్వాత పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది.

ఈనెల 11న ఉదయం 11:40 గంటలకు వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో టీటీడీ అధికారులు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఛైర్మన్ మాత్రమే బాధ్యతలు స్వీకరిస్తుండటంతో.. వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ నిమగ్నమైంది. ప్రమాణ స్వీకారం అనంతరం వీరందరికి స్వామివారి దర్శనం కల్పించేలా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీటీడి చైర్మన్ నియామకం పూర్తయినప్పటికీ సభ్యుల నియామకాన్ని మాత్రం ప్రభుత్వం వాయిదా వేసింది. సభ్యులుగా పాలకమండలిలో తమ వారికి సభ్యత్వం ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పెద్దలు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా విజ్ఞప్తులు రావడంతో సభ్యుల నియమాకంపై ప్రభుత్వం ఓ క్లారిటీకి రావట్లేదు. పాలకమండలిలో సభ్యత్వం కోసం ప్రభుత్వంపైన పలువురు ఆశావహుల నుంచి విపరీతంగా ఒత్తిడి వస్తుండటంతో... ఛైర్మన్‌ను నియమించి సభ్యుల నియామకాన్ని వాయిదా వేయడమే శ్రేయస్కరమని భావించి చివరి నిమిషంలో సభ్యుల నియామకాన్ని నిలిపివేసిందని సమాచారం. దేశ వ్యాప్తంగా పాలకమండలిలో సభ్యత్వం కోసం వందల సంఖ్యల సిఫార్సులు వచ్చాయి. దీంతో సభ్యుల నియామకంపై వడపోత చేసి అందర్నీ సంతృప్తిపర్చేలా బోర్డును నియమించేలా కసరత్తు చేస్తోంది. మొత్తంమీద పూర్తి స్థాయి పాలకమండలిని ఆగస్టు నెలాఖరు లోపల నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.



ఏపీలో మళ్లీ ఓట్ల పండుగ

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>