SportsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/neeraj-chopra21d4cf08-83bd-4592-a670-2d3912ef7d87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/neeraj-chopra21d4cf08-83bd-4592-a670-2d3912ef7d87-415x250-IndiaHerald.jpgఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకి సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కువ. ఆయన గత ఇంటర్వ్యూలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. జులపాల జుట్టు పెంచుకోడానికి ఏ హీరో మీకు ఆదర్శం అని అడిగితే, తనకు తానే హీరో అని చెప్పి అందరికీ షాకిచ్చారు నీరజ్. అలాంటి నీరజ్ ఇప్పుడు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీపై అదిరిపోయే పంచ్ వేశారు. neeraj chopra{#}Ram Gopal Varma;Saina Nehwal;Winner;gold;Industry;Hero;Cinemaసినిమావాళ్లపై అదిరిపోయే పంచ్ వేసిన నీరజ్ చోప్రా..సినిమావాళ్లపై అదిరిపోయే పంచ్ వేసిన నీరజ్ చోప్రా..neeraj chopra{#}Ram Gopal Varma;Saina Nehwal;Winner;gold;Industry;Hero;CinemaTue, 10 Aug 2021 07:06:27 GMTఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకి సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కువ. ఆయన గత ఇంటర్వ్యూలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. జులపాల జుట్టు పెంచుకోడానికి ఏ హీరో మీకు ఆదర్శం అని అడిగితే, తనకు తానే హీరో అని చెప్పి అందరికీ షాకిచ్చారు నీరజ్. అలాంటి నీరజ్ ఇప్పుడు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీపై అదిరిపోయే పంచ్ వేశారు.

సినిమావాళ్లు ఏ హాట్ సబ్జెక్ట్ వచ్చినా వదిలిపెట్టరు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లయితే సెన్సేషన్ అయిన ప్రతి సబ్జెక్ట్ పైనా సినిమా మొదలు పెడుతున్నట్టు ప్రకటన ఇచ్చేస్తారు. అది పూర్తవుతుందా లేదా అనేది తర్వాతి సంగతి, ముందుగా ప్రచారం మాత్రం కొట్టేస్తారు. ఈ క్రమంలో ఇటీవల బయోపిక్ ల హవా నడుస్తోంది. సహజంగా బయోపిక్ అంటే.. పరిపూర్ణ జీవితం గడిపి చరమాంకానికి చేరుకున్నవారి విషయాలను వెలుగులోకి తీస్తుంటారు. కానీ ఇటీవల కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నవారిపై కూడా బయోపిక్ లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలపై బయోపిక్ లు కోకొల్లలు.

సచిన్, ధోనీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జీవితాలు తెరపైకి వచ్చాయి. అంతెందుకు ఇంకా కెరీర్ ముగించని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  సైనా నెహ్వాల్ పై కూడా సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలు యువతకు ఇన్స్ పిరేషన్ గా నిలుస్తాయనడాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఇంకా కెరీర్ ముగించనివారిపై ఎడాపెడా సినిమాలు తీస్తే అవి ఎంతవరకు అర్థవంతంగా ఉంటాయనేదే ప్రశ్న. ఈ క్రమంలో ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను ఎవరైనా ఎందుకు వదిలిపెడతారు చెప్పండి. జావెలిన్ వీరుడిపై సిినిమాలు తీయడానికి ఇప్పటికే చాలామంది స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే మనోడికి మాత్రం తనపై ఇప్పుడప్పుడే సినిమా తీయడం ఇష్టంలేదట.

అవును, నీరజ్ చోప్రా తన బయోపిక్ అప్పుడే తీయొద్దంటున్నారు. తన వయసు జస్ట్ 23 ఏళ్లు మాత్రమేనని, తనకింకా భవిష్యత్ ఉందని, తన గురించి చెప్పాల్సి వస్తే ఆ సినిమా సమగ్రంగా ఉండాలని, అందుకే తాను రిటైర్ అయిపోయిన తర్వాత సినిమా తీయాలని ఇండస్ట్రీ వర్గాలకు చురకలంటించారు. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడం అలవాటైన వారికి ఇది అదిరిపోయే పంచ్.



హుజురాబాద్ బైపోల్ పై కేటీఆర్ సైలెన్స్.. కార‌ణం ఏంటి.?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>