BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag48186b8b-b71e-478a-a3e8-7db4cd3af331-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag48186b8b-b71e-478a-a3e8-7db4cd3af331-415x250-IndiaHerald.jpgక‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తాపార్టీలో మ‌ళ్లీ అస‌మ్మ‌తి త‌లెత్తిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. మంత్రి ప‌ద‌వుల‌పై వ‌చ్చిన అసంతృప్తిని చ‌ల్ల‌బ‌రిచేందుకు ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి రావ‌డంలేదు. త్వ‌ర‌లోనే హ‌స్తిన‌కు వెళ్లి అధిష్టానంతో చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చేవారం ఢిల్లీ వెళుతున్న‌ట్లు ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. భార‌తీయ జ‌న‌తాపార్టీవ‌ర్గాలు చెబుతున్న స‌మాచారం మేర‌కే ఆయ‌న అసంతృప్తిపైనే పెద్ద‌ల‌తో మాట్లాడ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ అస‌మ్మ‌తి రాష్ట్ర‌స్థాయtag{#}Delhi;Ministerక‌ర్ణాట‌క బీజేపీలో అస‌మ్మ‌తి?క‌ర్ణాట‌క బీజేపీలో అస‌మ్మ‌తి?tag{#}Delhi;MinisterTue, 10 Aug 2021 16:27:20 GMT
క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తాపార్టీలో మ‌ళ్లీ అస‌మ్మ‌తి త‌లెత్తిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. మంత్రి ప‌ద‌వుల‌పై వ‌చ్చిన అసంతృప్తిని చ‌ల్ల‌బ‌రిచేందుకు ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి రావ‌డంలేదు. త్వ‌ర‌లోనే హ‌స్తిన‌కు వెళ్లి అధిష్టానంతో చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చేవారం ఢిల్లీ వెళుతున్న‌ట్లు ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. భార‌తీయ జ‌న‌తాపార్టీవ‌ర్గాలు చెబుతున్న స‌మాచారం మేర‌కే ఆయ‌న అసంతృప్తిపైనే పెద్ద‌ల‌తో మాట్లాడ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ అస‌మ్మ‌తి రాష్ట్ర‌స్థాయిలో చ‌ల్ల‌బ‌డ‌ద‌ని, ఢిల్లీ స్థాయిలో మాట్లాడితేనే సద్దుమ‌ణుగుతుంద‌ని ఆయ‌న వారితో చెప్ప‌పోతున్న‌ట్లు పార్టీవ‌ర్గాలంటున్నాయి. తాను కోరుకున్న శాఖ రాలేదంటూ పుర‌పాల‌క‌శాఖ మంత్రి ఎంటీబీ నాగ‌రాజ్ బ‌హిరంగంగానే త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌ద‌వి త‌న స్థాయిని త‌క్కువ చేసి చూపుతోంద‌ని, మార్చ‌క‌పోతే త‌న నిర్ణ‌యం తాను తీసుకుంటానంటూ బెదిరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయ‌నతో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌తోపాటు మ‌రో ఇద్ద‌రు మంత్రులు కూడా త‌మ‌కు కేటాయించిన శాఖ‌ల‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.



ఒలింపిక్స్ ప‌త‌కం పోలీసుల‌కు అంకితం

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>