PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ap-covid1f92c7c0-35b9-453b-a974-a22b4951933e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ap-covid1f92c7c0-35b9-453b-a974-a22b4951933e-415x250-IndiaHerald.jpgకరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో నైట్ కర్ఫ్యూ పూర్తి స్థాయిలో అమలులో ఉంది. చాలా చోట్ల పగటిపూట కూడా ఆంక్షలు అమలవుతున్నాయి. ఓవైపు ఈనెల 16నుంచి స్కూల్స్ తిరిగి మొదలు పెట్టాలని చూస్తున్నా ఆంక్షల సడలింపులో మాత్రం సర్కారు ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. అందుకే సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోకపోయినా ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపలేదు. సెకండ్ షో లకు ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదు. ap covid{#}Cinema Theatre;Jagan;Guntur;Government;Andhra Pradesh;Coronavirusఏపీలో ఆంక్షలు మరింత కఠినం.. జగన్ కీలక నిర్ణయంఏపీలో ఆంక్షలు మరింత కఠినం.. జగన్ కీలక నిర్ణయంap covid{#}Cinema Theatre;Jagan;Guntur;Government;Andhra Pradesh;CoronavirusTue, 10 Aug 2021 08:00:00 GMTకరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో నైట్ కర్ఫ్యూ పూర్తి స్థాయిలో అమలులో ఉంది. చాలా చోట్ల పగటిపూట కూడా ఆంక్షలు అమలవుతున్నాయి. ఓవైపు ఈనెల 16నుంచి స్కూల్స్ తిరిగి మొదలు పెట్టాలని చూస్తున్నా ఆంక్షల సడలింపులో మాత్రం సర్కారు ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. అందుకే సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోకపోయినా ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపలేదు. సెకండ్ షో లకు ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదు.

వివాహాలు, మతపరమైన కార్యక్రమాలు, సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్య ఎంత ఉండాలనే విషయంపై కొత్త నిబంధనలు అమలు చేయాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. సమూహాలుగా చేరే కార్యక్రమం ఏదయినా అక్కడ ఉండేవారి సంఖ్య 150మంది మాత్రమే అని తేల్చి చెప్పింది. అంతకంటే ఒక్కరు ఎక్కువైనా కార్యక్రమ నిర్వాహకులపై కేసు పెడతారు. విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటారు.

శ్రావణ మాసం పెళ్లిల్ల సీజన్ మొదలు కావడంతో జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లకు హాజరయ్యేవారిపై ఆంక్షలు విధించింది. ఇలాంటి సామూహిక కార్యక్రమాల వల్ల కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. కరోనా పుట్ట పగిలితే, ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి రాష్ట్రమంతా ఆంక్షలు పెట్టాల్సి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇక సామూహిక కార్యక్రమాల్లో మాస్క్ లు, శానిటైజర్లు తప్పనిసరి. పెళ్లిల్లయినా, ఇతర కార్యక్రమాలయినా భౌతిక దూరం పాటించాల్సిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మాస్క్ లేకపోతే జరిమానా..
మరోవైపు కేసులు పూర్తిగా తగ్గకపోయినా మాస్క్ ల వాడకం మాత్రం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మాస్క్ లు లేనివారికి జరిమానా విధించే నిబంధనలు ఏపీలో అమలులో ఉన్నాయి. అయితే ఎక్కడా వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదు. గుంటూరు నగరంలో మాత్రం మాస్క్ లేకపోతే 100రూపాయలు జరిమానా వసూలు చేస్తున్నారు. ఎవరైనా సరే ఇంట్లోనుంచి బయటకు రావాలంటే మాస్క్ తప్పనిసరి అంటున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా మాస్క్ నిబంధన, లేకపోతే జరిమానా విదించడాన్ని తప్పనిసరి చేయబోతున్నారు.



ఏపీలో మళ్లీ ఓట్ల పండుగ

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>