PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/charitra-srustinchina-modi-toli-bharatha-pradaniga-record1f8572f9-3ff6-4198-ae3c-2e30f7c2097d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/charitra-srustinchina-modi-toli-bharatha-pradaniga-record1f8572f9-3ff6-4198-ae3c-2e30f7c2097d-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఆయన ఏం సాధించారు.. ఇదేగా మీ ప్రశ్న.. ఇప్పటి వరకూ మన దేశ ప్రధాని ఎవరూ సాధించని పని ఆయన సాధించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఓ సదస్సుకు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో జరిగిన సదస్సుకు ఇలా ఓ భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి. మరి ఈ అవకాశం ఎలా దక్కింది.. దీనికి కారణం ఏంటి.. ఇది ఎలాగంటే.. భద్రతామండలికి నెలకో దేశం తాత్కాలికంగా అధ్యక్షత వహిస్తుంది.. ఈ అవకmodi{#}INTERNATIONAL;Prime Minister;Narendra Modi;Indiaచరిత్ర సృష్టించిన మోడీ.. తొలి భారత ప్రధానిగా రికార్డ్..!చరిత్ర సృష్టించిన మోడీ.. తొలి భారత ప్రధానిగా రికార్డ్..!modi{#}INTERNATIONAL;Prime Minister;Narendra Modi;IndiaTue, 10 Aug 2021 06:00:00 GMTప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఆయన ఏం సాధించారు.. ఇదేగా మీ ప్రశ్న.. ఇప్పటి వరకూ మన దేశ ప్రధాని ఎవరూ సాధించని పని ఆయన సాధించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఓ సదస్సుకు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో జరిగిన సదస్సుకు ఇలా ఓ భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి.


మరి ఈ అవకాశం ఎలా దక్కింది.. దీనికి కారణం ఏంటి.. ఇది ఎలాగంటే.. భద్రతామండలికి నెలకో దేశం తాత్కాలికంగా అధ్యక్షత వహిస్తుంది.. ఈ అవకాశం కేవలం కొన్ని దేశాలకే పరిమితం. ఇటీవల ఇండియా ఆ అవకాశం సాధించింది. ఈనెల రోజులు భద్రతామండలికి భారత్ నాయకత్వం వహిస్తుంది. భారత్ నాయకత్వం వహిస్తున్న సమయం కాబట్టి ఈ సదస్సుకు ప్రధాని మోడీ నాయకత్వం వహించారు. సముద్ర భద్రతకు అవసరమైన సహకారం కోసం కార్యాచరణ సిద్ధం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో పేర్కొన్నారు.


సముద్ర భద్రత పెంపు, అంతర్జాతీయ సహకారంపై ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో జరిగిన ఉన్నతస్థాయి బహిరంగ సదస్సుకు ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, భద్రతామండలిలోని సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సముద్ర తలంపై జరిగే నేరాలు, భద్రతా సమస్యలను సమర్థంగా ఎదుర్కొనటంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. ఇందుకు అవసరమైన పంచసూత్రాలను మోదీ ప్రతిపాదించారు.


సముద్ర వాణిజ్యానికి అడ్డంకులు తొలగాలని, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మోదీ ప్రపంచ దేశాలకు సూచించారు. సముద్ర వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని... సముద్ర వాణిజ్యం సజావుగా సాగటంపైనే మనందరి అభివృద్ధి ఆధారపడి ఉందని తెలిపారు. స్వేచ్ఛా సముద్ర వాణిజ్యం అనేది భారత సంప్రదాయంలో అనాది కాలం నుంచి ఉంటూ వస్తోందని మోడీ గుర్తు చేశారు.



చరిత్ర సృష్టించిన మోడీ.. తొలి భారత ప్రధానిగా రికార్డ్..!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>