PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpg రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యినప్ప‌టి నుంచి ఆయ‌న వ్య‌తిరేకంగా మాట్లాడుతూ వ‌స్తున్నారు కొమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌. తాజాగా రేవంత్ రెడ్డికి ఝ‌ల‌క్ ఇచ్చారు భువ‌న‌గిరి ఎంపీ కోమటి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అన్ని ర‌కాలుగా స‌పోర్ట్ ఇస్తానంటూనే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కామెంట్ చేశారు వెంక‌ట్ రెడ్డి. ఇటీవ‌ల రేవంత్ రెడ్డితో తాను భేటీ అయిన‌ట్లు మీడియాకు తెలిపారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తాన‌ని తెలిపారు. రేవంత్ రెడ్డితో క‌లిసి ప‌ని చేసేందుకు ఎలcongress{#}Komati;Bhuvanagiri;revanth;TDP;Reddy;TPCC;Revanth Reddy;రాజీనామా;MLA;Congress;Partyటీడీపీ క్యాడ‌ర్ అవ‌స‌రం లేద‌న్న కోమ‌టి రెడ్డి.. రేవంత్ రెడ్డికి ఝ‌ల‌క్‌..!టీడీపీ క్యాడ‌ర్ అవ‌స‌రం లేద‌న్న కోమ‌టి రెడ్డి.. రేవంత్ రెడ్డికి ఝ‌ల‌క్‌..!congress{#}Komati;Bhuvanagiri;revanth;TDP;Reddy;TPCC;Revanth Reddy;రాజీనామా;MLA;Congress;PartyTue, 10 Aug 2021 08:15:00 GMT
  రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యినప్ప‌టి నుంచి ఆయ‌న వ్య‌తిరేకంగా మాట్లాడుతూ వ‌స్తున్నారు కొమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌. తాజాగా రేవంత్ రెడ్డికి ఝ‌ల‌క్ ఇచ్చారు భువ‌న‌గిరి ఎంపీ కోమటి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అన్ని ర‌కాలుగా స‌పోర్ట్ ఇస్తానంటూనే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కామెంట్ చేశారు వెంక‌ట్ రెడ్డి. ఇటీవ‌ల రేవంత్ రెడ్డితో తాను భేటీ అయిన‌ట్లు మీడియాకు తెలిపారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తాన‌ని తెలిపారు. రేవంత్ రెడ్డితో క‌లిసి ప‌ని చేసేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కోమ‌టి రెడ్డి వెల్ల‌డించారు. కానీ, టీడీపీ నేత‌లు, కేడ‌ర్ వెంట ప‌డి వారిని పార్టీలోకి తీసుకురావాల్సిన అవ‌సరం లేద‌ని అభిప్రాయ ప‌డ్డారు వెంక‌ట్ రెడ్డి.



   దీనికి బ‌దులుగా కాంగ్రెస్‌లో ఉన్న నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌లు, సీనియ‌ర్ నేత‌ల‌ను విశ్వాసంలోకి తీసుకుని వారిని త‌గిన గౌర‌వం ఇవ్వాల‌ని సూచించారు. గ‌తంలో పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌విని కాంగ్రెస్ అధిష్టానం అమ్ముకుంద‌ని వెంక‌ట్ రెడ్డితీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి వ‌చ్చిన త‌రువాత కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు బెట్టారు.


అందులో భాగంగానే రేవంత్ రెడ్డి టీడీపీ కి చెందిన సీనియ‌ర్ నాయ‌కుల‌ను క‌లిసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సంగ‌తి విధిత‌మే. కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి టీడీపీ క్యాడ‌ర్ అవ‌సరం లేదు అన్న కామెంట్ వ‌ల్ల ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిని అన‌డ‌మేన‌ని పార్టీ నేత‌లు అనుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వాడే కాబ‌ట్టి ఈ కామెంట్‌కు కాస్త ప్రాధాన్య‌త ఉంద‌నుకోవ‌చ్చు.

  గ‌త కొన్ని రోజులుగా ఎమ్మెల్యే రాజీనామాతో త‌మ నియోజ‌వ‌ర్గం అభివృద్ది జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలోనే కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌లన కామెంట్ చేశారు. త‌మ నియోజ‌క వ‌ర్గంలో ఉన్న పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేసి అభివృద్ది చేస్తే తాను త‌న తో పాటు ఆయ‌న సోద‌రుడు కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి క‌లిసి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కూడా.







ఏపీలో మళ్లీ ఓట్ల పండుగ

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>