PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dogs-oldage-homesef5cc295-3180-42c9-b3d5-54b9098ecd2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dogs-oldage-homesef5cc295-3180-42c9-b3d5-54b9098ecd2e-415x250-IndiaHerald.jpgశున‌కాల‌ను అంద‌రూ త‌క్కువ అంచ‌నా వేస్తారు. కానీ వాటిని పోలీసులు ఉప‌యోగించినంత ఎవ‌రూ ఉప‌యోగించ‌రు. పోలీసు శాఖలో శునకాలు కీల‌క ప్రాత వ‌హిస్తాయి. పోలీసు శాఖ‌లోని ఆధారాలు కనుగొనేందుకు, నేరస్థులను పట్టించేందుకు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. శున‌కాల‌తోనే అనేక కేసులను పోలీసులు ప‌రిష్క‌రించారు. దాదాపుగా ముఖ్య‌మైన కేసుల్లో వీటిని త‌ప్ప‌కుండా ఉప‌యోగిస్తారు. అయితే పోలీసు శాఖ నుంచి శున‌కాలు రిటైర‌యితాయా..త‌రువాత వాటి పరిస్థితి ఏంటి.. అనేది అంద‌రి మ‌దిలో ఒక ప్రశ్న అయితే ఉంటుంది. అయితే రిటైరయ్యాక శున‌కాలు ద‌ర్జాగాdogs oldage homes{#}ajith kumar;contract;Ajit Pawar;anand malayalam actor;Anand Deverakonda;Dogs;Traffic police;Gujarat - Gandhinagar;House;policeఆ శునకాలకు ఓల్డేజ్​ హోమ్​.. ఎక్కడంటే..?ఆ శునకాలకు ఓల్డేజ్​ హోమ్​.. ఎక్కడంటే..?dogs oldage homes{#}ajith kumar;contract;Ajit Pawar;anand malayalam actor;Anand Deverakonda;Dogs;Traffic police;Gujarat - Gandhinagar;House;policeTue, 10 Aug 2021 13:00:00 GMTశున‌కాల‌ను అంద‌రూ త‌క్కువ అంచ‌నా వేస్తారు. కానీ వాటిని పోలీసులు ఉప‌యోగించినంత ఎవ‌రూ ఉప‌యోగించ‌రు. పోలీసు శాఖలో శునకాలు కీల‌క ప్రాత వ‌హిస్తాయి. పోలీసు శాఖ‌లోని ఆధారాలు కనుగొనేందుకు, నేరస్థులను పట్టించేందుకు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. శున‌కాల‌తోనే అనేక కేసులను పోలీసులు ప‌రిష్క‌రించారు. దాదాపుగా ముఖ్య‌మైన కేసుల్లో వీటిని త‌ప్ప‌కుండా ఉప‌యోగిస్తారు. అయితే పోలీసు శాఖ నుంచి శున‌కాలు రిటైర‌యితాయా..త‌రువాత వాటి పరిస్థితి ఏంటి.. అనేది అంద‌రి మ‌దిలో ఒక ప్రశ్న అయితే ఉంటుంది. అయితే రిటైరయ్యాక శున‌కాలు ద‌ర్జాగా జీవించ‌డానికి గుజరాత్ పోలీసు శాఖ ఓ వినూత్న ఆలోచన చేసింది. పదవీ విరమణ చేసిన పోలీసు శున‌కాల కోసం ప్ర‌త్యేకంగా ఒక ఓల్డేజ్ హోమ్ను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది.

గుజరాత్లోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ వే సమీపంలో ఆనంద్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ శునకాల ఓల్డేజ్ హోమ్ ను ఏర్పాటు చేశారు.  పటిష్ఠమైన ఇనుప గేటును ఓల్డేజ్ హోమ్‌కు పెట్టారు. గేట్ వ‌ద్దే ఓ జర్మన్ షెపర్డ్ శునకం ఉంటుంది. 'డాగ్స్ నెవర్ బైట్స్. జస్ట్ హ్యూమన్స్' అనే కొటేషన్ ఎదురుగానే ఉంటుంది.

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అతిపెద్ద శునకాల ఓల్డేజ్ హోమ్ కూడా ఒక‌టి ఉంది. ఆ తరువాత అతిపెద్ద రిటైర్డ్ శున‌కాల‌ సంరక్షణ కేంద్రం తాజాగా ఆనంద్ సమీపంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ కే-9 యూనిట్లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన 11 జర్మన్ షెపర్డ్, లాబ్రాడర్ జాతుల జాగిలాలు ఉన్నాయి. అయితే ఈ డాగ్ ఓల్డేజ్ హోమ్‌లో 10 సంవత్సరాల వయసు క‌లిగిన స్నూపీ చాలా అలర్ట్గా ఉండ‌ట‌మే కాకుండా ఓల్డేజ్ హోమ్ను పరిరక్షిస్తుంటుంది. కొత్తగా ఎవ‌రైనా మనుషులు వచ్చినా అరవడంతో పాటు ఏవైనా జంతువులు వచ్చినా మిగిలిన శున‌కాల‌ను జాగ్రత్త పరుస్తుంది.ఈ సంవ‌త్స‌రం జూలై 25న గుజరాత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఆశీష్ భాటియా ఈ డాగ్స్ ఓల్డేజ్ హోమ్ను ప్రారంభించారు. శునకాలకు అన్ని వ‌స‌తులు కల్పించేందుకు కామధేను యూనివర్సిటీతో పోలీసు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
 
'రిటైరైన పోలీసు శునకాలను గతంలో వేలం పాట వేసి, జంతు ప్రేమికులకు దత్తత ఇచ్చేవారు. అయితే ఇళ్ల‌లో పెంపుడు జంతువుల్లా ఉండటం పదవీ విరమణ పొందిన పోలీసు శునకాలకు సౌక‌ర్యంగా లేద‌ని, సర్వీస్లో ఉన్న విధంగానే వాటికి మంచి ఆహారం అందించేలా ఏర్ప‌టు చేశామ‌ని ఆనంద్ ఎస్పీ అజిత్ రజియన్ తెలిపారు.



`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>