Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonbd5cd521-32cd-40fc-9738-e4bd7783ebbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonbd5cd521-32cd-40fc-9738-e4bd7783ebbc-415x250-IndiaHerald.jpgమహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరుకు భారత క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి భారత అంతర్జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కొన్ని రోజుల్లోనే తన సత్తా ఏంటో చూపించాడు. తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపును తనవైపు ఆకర్షించడంలో ధోనీ విజయం సాధించాడు. ఆ తర్వాత ఇక భారత జట్టులో అంచెలంచెలుగా ఎదిగి జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టే స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత కూడా తన సారథ్యంతో టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు అనDhon{#}Karthik;MS Dhoni;collector;INTERNATIONAL;Yuva;Cricketధోని వచ్చాడు.. నా పని అయిపోయింది.. స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?ధోని వచ్చాడు.. నా పని అయిపోయింది.. స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?Dhon{#}Karthik;MS Dhoni;collector;INTERNATIONAL;Yuva;CricketTue, 10 Aug 2021 16:00:00 GMTమహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరుకు భారత క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి భారత అంతర్జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కొన్ని రోజుల్లోనే తన సత్తా ఏంటో చూపించాడు. తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపును తనవైపు ఆకర్షించడంలో ధోనీ విజయం సాధించాడు. ఆ తర్వాత ఇక భారత జట్టులో అంచెలంచెలుగా ఎదిగి జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టే స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత కూడా తన సారథ్యంతో టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మహేంద్రసింగ్ ధోని జట్టులోకి వచ్చిన సమయంలో కొంతమంది క్రికెట్ క్రికెటర్ల కెరీర్లు అయోమయంలో పడి పోయాయి. ఇలాంటి క్రికెటర్లలో దినేష్ కార్తీక్ కూడా ఒకరు.


 అప్పటివరకు భారత్కు రెగ్యులర్ వికెట్ కీపర్గా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ గా ఉన్న దినేష్ కార్తీక్ ధోని రావడంతో  అతని స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి అతని కెరీర్ క కాస్త అయోమయంలో పడిపోయింది. ధోనీ జట్టులోనే ఉండడంతో ఇక వికెట్ కీపర్గా ఎలాంటి అవకాశాలు దక్కలేదు. దీంతో స్పెషలిస్ట్ బ్యాట్మెన్గా దినేష్ కార్తీక్ మారాల్సి వచ్చింది. అంతేకాదు ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సత్తా చాటుతున్న నేపథ్యంలో ఎన్నో రోజుల నుంచి జట్టుకు దూరంగానే ఉంటున్నాడు దినేష్ కార్తీక్. ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.



 తనకు అవకాశాలు రాకపోతే నేనెప్పుడూ కుంగిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టానని తెలిపాడు. ఒకానొక సమయంలో తన కెరీర్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అవతారం ఎత్తాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ సమయంలో తాను ఒక మంచి ప్రతిభావంతుడని మంచి బ్యాట్స్మెన్ అన్న విషయాన్ని ధోని సహా మరికొంతమంది చెప్పి ప్రోత్సహించారూ అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ధోని చెప్పిన మాటలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి అంటూ తెలిపాడు. ధోని జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఒక తుఫానులా దూసుకు వచ్చాడని ఇక అతని రాక తో తన తలుపులు మూసుకు పోయాయి అని భావించాను అంటూ తెలిపాడు. ధోని లాంటి వాళ్ళు తరానికి ఒక్కడే ఉంటాడు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.



పుష్ప సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. !

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>