PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/small-baby51bb002a-7802-477f-9217-feb7bddf9b3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/small-baby51bb002a-7802-477f-9217-feb7bddf9b3f-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే అతి చిన్న బేబీ ఎక్కడ ఉందో తెలుసా..? ప్రజెంట్ సోషల్ మీడియా వరల్డ్‌లో ఇంట్రెస్టింగ్ న్యూస్ అందరికీ క్షణాల్లోనే తెలిసిపోతున్నాయి. అందరూ డిజిటల్లీ యాక్టివ్‌గా ఉండటం ఇందుకు ఓ కారణం. కాగా, స్మార్ట్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగిపోయింది. దాంతో సోషల్ మీడియా ద్వారానే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ప్రపంచంలోనే అతి చిన్న బేబీ గురించి వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆ బేబీ ఎక్కడుంది? ప్రస్తుతం ఎలా ఉంది? వంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిsmall baby{#}media;Smart phone;News;Singapore;Parentsప్రపంచంలోనే అతి చిన్న బేబీ ఎక్కడ ఉందో తెలుసా..?ప్రపంచంలోనే అతి చిన్న బేబీ ఎక్కడ ఉందో తెలుసా..?small baby{#}media;Smart phone;News;Singapore;ParentsTue, 10 Aug 2021 17:00:00 GMTమీడియా వరల్డ్‌లో ఇంట్రెస్టింగ్ న్యూస్ అందరికీ క్షణాల్లోనే తెలిసిపోతున్నాయి. అందరూ డిజిటల్లీ యాక్టివ్‌గా ఉండటం ఇందుకు ఓ కారణం. కాగా, స్మార్ట్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగిపోయింది. దాంతో సోషల్ మీడియా ద్వారానే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ప్రపంచంలోనే అతి చిన్న బేబీ గురించి వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆ బేబీ ఎక్కడుంది? ప్రస్తుతం ఎలా ఉంది? వంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రపంచంలోనే అతి చిన్న బేబీ పేరు క్వెక్ యూ షువాన్. కాగా ఈ చిన్నారి జన్మించినపుడు కేవలం 212 గ్రాముల బరువే ఉంది. ఓ చిన్న యాపిల్ బరువున్న ఈ బేబీ 24 సెంటిమీటర్ల పొడవే ఉంది. ఈ పాప ప్రస్తుతం ఇంటికి చేరుకుంది. సింగపూర్ ఆస్పత్రిలో పదమూడు నెలలు ట్రీట్‌మెంట్ పొంది ఆరోగ్యంగా పేరెంట్స్ వద్దకు వెళ్లింది. ఈ చిన్నారి తల్లి గర్భంలో కేవలం 25 వారాలే ఉందట. సాధారణంగా 40 వారాల పాటు శిశువు మాతృమూర్తి గర్భంలో ఉండాలి. కానీ, ఇమె అందుకు భిన్నంగా ముందే బయటకు వచ్చేసింది. పుట్టినపుడు అతి తక్కువ బరువున్న షువాన్  13 నెలల తర్వాత 6.3 కేజీలు అయింది. ఈ చిన్నారి బర్త్ సమయంలో బతికే అవకాశాలు చాలా తక్కువని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో డాక్టర్స్ భావించారు. అయితే, పాప చికిత్సకు స్పందించడంతో ఒక్కొక్కటిగా అన్ని హెల్త్ ఇష్యూస్‌ను అధిగమించింది. ఈ శిశువు ఇతర చిన్నారులకు ఆదర్శమని ఈ సందర్భంలోనే సింగపూర్ ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. డాక్టర్స్ చిన్నారి షువాన్‌కు వైద్యం అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా వైద్యులు రకరకాల మెషిన్స్ ఉపయోగించారు. మొత్తంగా బేబీ ఇప్పుడు హెల్దీగా ఉండటం చూసి డాక్టర్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇకపోతే షువాన్ పుట్టినపుడు అంత చిన్నగా ఉండడం చూసి షాక్ అయినట్లు పాప తల్లి వాంగ్ మీ లింగ్ చెప్పుకొచ్చారు. షువాన్‌కు హాస్పిటల్‌లో చికిత్స అందించేందుకుగాను పాప తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.2.72 కోట్లకు పైనే సేకరించి ఆస్పత్రికి చెల్లించారు.


పుష్ప సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. !

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>