PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/adilabad06abb7d3-b8b3-42d6-a754-bae461af5ffd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/adilabad06abb7d3-b8b3-42d6-a754-bae461af5ffd-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మ‌ళ్లీ పుంజుకునేలా చేసీ అధికారంలోకి తీసుకురావ‌డ‌మే దిశ‌గా ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగానే `ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా` పేరుతో స‌భ‌లు నిర్వ‌హించేందుకు రెడీ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్రంలోని ద‌ళితుల‌తో పాటు గిరిజ‌నుల‌కు కూడా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌తిష్టాత్మ‌కcongress{#}Kumaar;indra;Reddy;TPCC;MP;local language;MLA;Telangana;Revanth Reddy;Party;war;CM;Ministerఇంద్రవెల్లి సభకు కీలక నేతల డుమ్మా.. అసమ్మతె వారిని ఆపిందా..?ఇంద్రవెల్లి సభకు కీలక నేతల డుమ్మా.. అసమ్మతె వారిని ఆపిందా..?congress{#}Kumaar;indra;Reddy;TPCC;MP;local language;MLA;Telangana;Revanth Reddy;Party;war;CM;MinisterTue, 10 Aug 2021 07:27:00 GMT తెలంగాణ‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మ‌ళ్లీ పుంజుకునేలా చేసీ అధికారంలోకి తీసుకురావ‌డ‌మే దిశ‌గా ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగానే `ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా` పేరుతో స‌భ‌లు నిర్వ‌హించేందుకు రెడీ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్రంలోని ద‌ళితుల‌తో పాటు గిరిజ‌నుల‌కు కూడా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హించిన ఇంద్ర‌వెల్లి స‌భ‌కు ఆ పార్టీ ముఖ్య‌నేతలు డుమ్మా కొట్టారు. ఇంద్ర వెల్లి స‌భ అన్న‌ప్ప‌టి నుంచి స్థానిక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేత‌ల వ‌ర‌కు విభేదాలు బ‌గ్గుమ‌న్నాయి. ఎటువంటి స‌మాచారం లేకుండానే స‌భ‌లు, స‌మావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారంటూ కీల‌క నేత‌లు గైర్హాజ‌ర‌య్యారు.


  గ‌తం నుంచి పార్టీకి అంతా తాము అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించిన నేత‌లు ఇప్పుడు ఇంద్ర‌వెల్లి స‌భ‌కు ఎందుకు రాలేదు. కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ ఇంకా త‌గ్గ‌లేదా.. కావాలనే ప‌క్క‌కు త‌ప్పుకుంటున్నారా లేదా ఆ నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడుతున్నారా ? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ప్ర‌స్తుత పార్ల‌మెంట్ స‌భ్యుడు, తాజా మాజీ పీసీసీ ప్రెసిడెండ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆయ‌న సోద‌రుడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి, మాజీ మంత్రి దామోద‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, చెన్నారెడ్డి, వీహెచ్‌, పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఈ స‌భ‌కు డుమ్మా కొట్టారు. వీరీ గైర్హాజ‌రు వెనుక కార‌ణాలేంటి అని పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.



  అయితే మొన్న‌టి వ‌ర‌కు పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆ త‌రువాత పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన‌డం లేద‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణం కార‌ణం పార్టీలో ఆయ‌న‌కు త‌గిన ప్రాధాన్య‌త లేక‌పోవ‌డ‌మేన‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డిన కొమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కు క‌నీసం స‌భ‌కు సంబంధించి ఆహ్వానం కూడా అంద‌లేద‌ని భాహ‌టంగా చెబుతున్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి స‌భా ఏర్పాట్ల‌ను దగ్గ‌ర ఉండి చూసుకున్నాడు. అయితే తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నందు వ‌ల్ల స‌భ‌కు హాజ‌రు కాలేద‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. మాణికం ఠాగూర్ పార్ల‌మెంట్ సెష‌న్స్‌లో బిజిగా ఉండ‌డం వ‌ల్ల రాలేక‌పోయార‌ని తెలుస్తోంది.


ఏది ఏమైన టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రెవంత్ రెడ్డి నియామ‌కం అయిన త‌రువాత నిర్వ‌హించిన స‌భ‌కు కీల‌క నేత‌లు గైర్హాజ‌ర‌వ‌డం వ‌ల్ల కార్య‌క‌ర్త‌లు, నేతలు అయోమ‌యంలో ప‌డ్డ‌ట్టు స‌మాచారం. ఇబ్ర‌హీం ప‌ట్నంలో ఈ నెల 17 నిర్వ‌హించే స‌భ‌లో అంద‌రు నాయ‌కులు పాల్గొంటార‌నే ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు.







ఏపీలో మళ్లీ ఓట్ల పండుగ

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>