PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-there-is-come-immediately-life-is-in-danger9df89016-e72c-4cd1-b452-ec72553a92c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-there-is-come-immediately-life-is-in-danger9df89016-e72c-4cd1-b452-ec72553a92c8-415x250-IndiaHerald.jpgఆఫ్ఘనిస్థాన్ రణరంగాన్ని తలపిస్తోంది. తాలిబన్లకు.. ఆ దేశ ప్రభుత్వ సైన్యానికి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న కాల్పుల్లో ఎందరో అమాయకులు బలైపోతున్నారు. అందులో భారతీయులు కూడా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనోళ్లను.. తిరిగి స్వదేశానికి వచ్చేయాలని కేంద్రం పిలుపునిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీకి ప్రత్యేక విమానాన్ని కూడా అందుబాటులో ఉంచింది. If there is come immediately Life is in danger{#}Army;Pakistan;American Samoa;Shakti;police;Indiaఅక్కడుంటే వెంటనే వచ్చేయండి.. ప్రాణానికే ప్రమాదం..!అక్కడుంటే వెంటనే వచ్చేయండి.. ప్రాణానికే ప్రమాదం..!If there is come immediately Life is in danger{#}Army;Pakistan;American Samoa;Shakti;police;IndiaTue, 10 Aug 2021 21:30:00 GMTమధ్య జరుగుతున్న హింసాత్మక పోరులో సాధారణ పౌరులు బలవుతున్నారు. తాజాగా బాల్ఖ్ ప్రావిన్స్ లోని మజార్-ఏ-షరీఫ్ ను లక్ష్యంగా చేసుకున్నట్టు తాలిబన్లు ప్రకటించడంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఆ ప్రాంతం, పరిసరాల్లో ఉన్న భారతీయులను వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది. ప్రత్యేక విమానం కూడా సిద్ధం చేసింది. ఆ విమానం ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేసింది. భారత్ కు వచ్చేవారు రాయబార కార్యాలయంలో పేర్లు ఇవ్వాలనీ.. భారతీయులను ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయాలని ఆఫ్ఘనిస్థాన్ లోని భారత సంస్థలకు సూచించింది.

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా.. బాల్ఖ్ ప్రావిన్స్ లో ఓ యువతి బిగుతు దుస్తులు ధరించడమే కాకుండా.. మగతోడు లేకుండా బయటకు వచ్చిందని తాలిబన్లు కాల్చి చంపారు. దాడి జరిగిన సమయంలో ఆ యువరి బుర్ఖా ధరించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తమ నియంత్రణలో నివసిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ మహిళలు బిగుతు దుస్తులు ధరించి బయట పనిచేయొద్దని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు.

ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందని అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ లో స్థిరత్వం, సుస్థిర పాలన కోసం భారత్ చేపట్టిన పనులు స్వాగతించదగ్గవని ప్రశంసించింది. ఆప్ఘాన్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతాల సంరక్షణ కోసం పాక్ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది. అయితే ఆఫ్ఘాన్ సైన్యానికి తాలిబన్లను ఎదుర్కొనే శక్తి ఉందని తెలిపింది.

ఇక తూర్పులద్ధాఖ్ లో మరోసారి తన యుద్ధ సన్నద్ధతను భారత సైన్యం పరీక్షించుకుంటోంది. చైనాతో ప్రతిష్ఠంభన తర్వాత ఎత్తైన ప్రాంతాలకు యుద్ధ సామాగ్రిని తరలించడం ఇదే తొలిసారి. దాదాపు 17వేల అడుగుల ఎత్తులోకి యుద్ధ ట్యాంకులను సైన్యం తరలిస్తోంది. టీ-90, టీ-72అజయ్ యుద్ధ ట్యాంకులను ఎడారి ప్రాంతాల నుంచి లద్ధాఖ్ కు చేరవేస్తోంది. మైనస్ ఉష్ణోగ్రతల వద్ద బలగాలను పరీక్షించేందుకు మోహరింపులు చేపట్టినట్టు ఆర్మీ తెలిపింది.















'త్రివిక్రమ్ - మహేష్' ల అసలు ప్లాన్ ఇదా..?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>