PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/religion-change58a43204-1c8d-4d97-8b8e-9fb10e4a2807-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/religion-change58a43204-1c8d-4d97-8b8e-9fb10e4a2807-415x250-IndiaHerald.jpgఉత్త‌ర‌ప్ర‌దేశ్ షామ్లీ జిల్లాలో సోమ‌వారం ఒకే కుటుంబానికి చెందిన 19 మంది హిందూ మ‌తంలోకి మారారు. దాదాపు 12 ఏళ్ల క్రితం తామంత హిందువుల‌మ‌ని ఇప్పుడు తిరిగి ఘ‌ర్ వాపాసి అయ్యామ‌ని వారు తెలిపారు. షామ్లీ జిల్లా కాంధ్లా ప‌ట్ట‌ణంలోని రాయ్ జ‌ద్‌గాన్ ప్రాంతంలో ఉంటున్న మొహ‌మ్మ‌ద్ ఉమ‌ర్ తో స‌హా ఆయ‌న కుటుంబంలోని 18 మంది హిందూ మ‌తం స్వీక‌రించారు. వీళ్లంతా ఓ ఆలయంలో నిర్వ‌హించిన శుద్ద హోమంలో పాల్గొన్నారు. ఆ త‌రువాత హిందూ మ‌తంలోకి మారారు. బంజారా స‌మాజానికి చెందిన వీళ్ల‌ను 12 ఏళ్ల క్రితం త‌న తండ్రి ఇస్లాం సreligion change{#}District;Father12 ఏళ్ల త‌రువాత హిందూమ‌తంలోకి ముస్లింలు ..అస‌లేం జ‌రిగింది?12 ఏళ్ల త‌రువాత హిందూమ‌తంలోకి ముస్లింలు ..అస‌లేం జ‌రిగింది?religion change{#}District;FatherTue, 10 Aug 2021 12:58:00 GMT ఉత్త‌ర‌ప్ర‌దేశ్ షామ్లీ జిల్లాలో సోమ‌వారం ఒకే కుటుంబానికి చెందిన 19 మంది హిందూ మ‌తంలోకి మారారు. దాదాపు 12 ఏళ్ల క్రితం తామంత హిందువుల‌మ‌ని ఇప్పుడు తిరిగి ఘ‌ర్ వాపాసి అయ్యామ‌ని వారు తెలిపారు. షామ్లీ జిల్లా కాంధ్లా ప‌ట్ట‌ణంలోని రాయ్ జ‌ద్‌గాన్ ప్రాంతంలో ఉంటున్న మొహ‌మ్మ‌ద్ ఉమ‌ర్ తో స‌హా ఆయ‌న కుటుంబంలోని 18 మంది హిందూ మ‌తం స్వీక‌రించారు. వీళ్లంతా ఓ ఆలయంలో నిర్వ‌హించిన శుద్ద హోమంలో పాల్గొన్నారు. ఆ త‌రువాత హిందూ మ‌తంలోకి మారారు.


      బంజారా స‌మాజానికి చెందిన వీళ్ల‌ను 12 ఏళ్ల క్రితం త‌న తండ్రి ఇస్లాం స్వీక‌రించార‌ని ఉమ‌ర్ తెలిపారు. ఆ సంద‌ర్భంలో త‌మ‌కు ఏం తెలీదని మోసం చేసి బ‌ల‌వంతంగా మ‌తం మార్పించార‌ని చెప్పాడు. ఈ కుటుంబం చాలా రోజుల్నుంచి మ‌హంత్‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఇందులో మ‌హిళ‌లు, పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే ఈ విష‌యంపై ఎలాంటి స‌మాచారం త‌మ‌కు లేద‌ని అధికారులు తెలిపారు.  ఆ కుటుంబ స‌భ్యుల‌తో అక్క‌డి అధికారులు మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇష్టానుసారం స్వేచ్చ‌గా మ‌తం మారే అవ‌కాశం ఉంద‌ని వారిని ఎవ‌రైనా బ‌ల‌వంతం చేసిన‌ట్లు తేలితే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.


   ఎంతో మంది మ‌తం మారాల‌నుకుంటున్న వాళ్లు త‌న‌ను సంప్ర‌దిస్తున్న‌ట్టు ఆ కుటుంబానికి మ‌త మార్పిడి కార్య‌క్ర‌మం చేసిన మ‌హంత్ జ‌స్వీర్ వెల్ల‌డించారు. ఎంతో మంది ఘ‌ర్ వాపాసీకి సిద్ద‌మ‌వుతున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే ఘ‌ర్ వాపాసీ అయిన ఉమ‌ర్ కుటుంబీకుల‌ను అంత‌కుముందు ముస్లిం మ‌తంలోకి రావాల‌ని ఎవ‌రు బ‌ల‌వంత పెట్టారో, ఒత్తిడి తెచ్చారో వెల్ల‌డించ‌లేదు. ఈ కుటుంబంలో ఇమ్రానా నుంచి అనితగా మారిన ఓ మ‌హిళ 12 ఏళ్ల క్రితం తాము ఎందుకు ముస్లీంలుగా మారామో చెప్పారు. మొద‌ట చ‌నిపోయిన వాళ్ల‌ను ఖ‌న‌నం చేసేవాళ్లం కానీ హిందువులు వారిని ఖ‌న‌నం చేయ‌నియ్య‌క‌పోవ‌డంతో తాము ముస్లీం మ‌తం స్వీక‌రించామ‌న్నారు. ఇప్పుడు ఎవ‌రి ప్ర‌మేయం, ఒత్తిడి లేకుండానే తాము తిరిగి హిందూ మ‌తం స్వీక‌రించామ‌ని మొత్తం మూడు కుటుంబాల్లోని 19 మంది ఘ‌ర్ వాపాసీ అయ్యామ‌ని తెలిపారు.









`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>