PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/terrorst86c9e84e-e5f1-45f7-851f-8d03d251f0d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/terrorst86c9e84e-e5f1-45f7-851f-8d03d251f0d7-415x250-IndiaHerald.jpgకశ్మీరీ యువతపై ఓ పోలీసు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. చదువుకుంటామనే సాకుతో పాకిస్తాన్ వెళ్తున్న యువత... అక్కడికి వెళ్లిన తర్వాత... టెర్రరిస్టులుగా మారుతున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ లో టెర్రరిజంలో చేరేందుకే చాలా మంది స్టడీ వీసాలు తీసుకుంటున్నారని జమ్ము కశ్మీర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని జమ్ము కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దిల్ బాగ్ సింగ్ కూడా ద్రువీకరించారు. ఇకపై పాకిస్తాన్ కు స్టడీ వీసాలను మరింత కఠినం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇప్పటికే సుమాTerrarism{#}Dil;Traffic police;Jammu and Kashmir - Srinagar/Jammu;central government;Director;Army;Pakistan;police;Indiaచదువు ముసుగు.. టెర్రరిజం వైపు పరుగుచదువు ముసుగు.. టెర్రరిజం వైపు పరుగుTerrarism{#}Dil;Traffic police;Jammu and Kashmir - Srinagar/Jammu;central government;Director;Army;Pakistan;police;IndiaTue, 10 Aug 2021 22:04:41 GMTకశ్మీరీ యువతపై ఓ పోలీసు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. చదువుకుంటామనే సాకుతో పాకిస్తాన్ వెళ్తున్న యువత... అక్కడికి వెళ్లిన తర్వాత... టెర్రరిస్టులుగా మారుతున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ లో టెర్రరిజంలో చేరేందుకే  చాలా మంది  స్టడీ వీసాలు తీసుకుంటున్నారని జమ్ము కశ్మీర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని జమ్ము కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దిల్ బాగ్ సింగ్ కూడా ద్రువీకరించారు. ఇకపై పాకిస్తాన్ కు స్టడీ వీసాలను మరింత కఠినం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇప్పటికే సుమారు 57 మంది  తీవ్రవాదుల జాబితాలో ఉన్నారని కూడా డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు.

2017, 2018 లో చాలా మంది కశ్మీరీ యువత... స్టడీ వీసా పొంది... పాకిస్తాన్ వెళ్లి తీవ్రవాదులుగా మారినట్లు డీజీపీ తెలిపారు. 57 మందిని ఇప్పటికే గుర్తించామన్న డీజీపీ..,, 17 మంది లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా భారత్ లోకి చొరబడి సైన్యం చేతిలో హతమయ్యారని తెలిపారు. 13 మంది ఇప్పటికీ యాక్టివ్ తీవ్రవాదులుగా ఉన్నారని.. మరో 17 మంది మాత్రం భారత్ కు తిరిగి రాలేదని డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు. కశ్మీర్ లోయలో యువత టెర్రరిజంలో చేరకుండా ఇప్పటికే పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారన్నారు జమ్ము డీజీపీ. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు... అలాగే ఇక్కడే వారికి మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు కూడా పోలీసు శాఖ ప్రయత్నిస్తోందని తెలిపారు. పంద్రాగస్టు వేడుకల్లో భారీ విధ్వంసానికి పాల్పడుతున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో... ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు... ముగ్గురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కశ్మీర్ లోయలో యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్న ఓ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కాశ్మీర్ లోయలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. గస్తీని ముమ్మరం చేశారు కూడా.





చదువు ముసుగు.. టెర్రరిజం వైపు పరుగు

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>