PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-vs-revanth19e4b7cf-beb7-4eca-9731-8250e04be47f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-vs-revanth19e4b7cf-beb7-4eca-9731-8250e04be47f-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజ‌కీయాలు రోజు రోజుకు మ‌రింత‌గా రంజుగా మారుతున్నాయి. ద‌ళిత సామాజిక వ‌ర్గంపై రాజ‌కీయ పార్టీల దృష్టి సారించాయి. ద‌ళితులే ప్ర‌ధాన అస్త్రంగా పావులు క‌దుపుతున్నారు రాష్ట్రంలోని పార్టీల అధినాయ‌కులు. అస‌లు ద‌ళితుల‌పై స‌డెన్ గా ప్రేమ పుట్ట‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి? ఓట్ల కోసం వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా ? అనే విష‌యం తేలాల్సి ఉంది. నాయ‌కుల స్వ‌లాభం కోసం మాత్రమే ద‌ళిత కార్డును ఎత్తుకుంటున్నారా.. అనుమానాల‌ను విశ్లేష‌కులు లేవ‌నెత్తుతున్నారు. ఆది నుంచి అట్ట‌డుగున ఉన్న ద‌ళిత‌, గిరిజ‌నkcr vs revanth{#}AdiNarayanaReddy;Rahul Gandhi;Huzurabad;CM;revanth;Congress;Telangana;prema;Love;KCR;Party`ద‌ళిత బంధు`కు `ద‌ళిత, గిరిజ‌న దండోరా` రీ సౌండ్ కానుందా..?`ద‌ళిత బంధు`కు `ద‌ళిత, గిరిజ‌న దండోరా` రీ సౌండ్ కానుందా..?kcr vs revanth{#}AdiNarayanaReddy;Rahul Gandhi;Huzurabad;CM;revanth;Congress;Telangana;prema;Love;KCR;PartyMon, 09 Aug 2021 09:24:28 GMT తెలంగాణ రాజ‌కీయాలు రోజు రోజుకు మ‌రింత‌గా రంజుగా మారుతున్నాయి. ద‌ళిత సామాజిక వ‌ర్గంపై రాజ‌కీయ పార్టీల దృష్టి సారించాయి. ద‌ళితులే ప్ర‌ధాన అస్త్రంగా పావులు క‌దుపుతున్నారు రాష్ట్రంలోని పార్టీల అధినాయ‌కులు. అస‌లు ద‌ళితుల‌పై స‌డెన్ గా ప్రేమ పుట్ట‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి? ఓట్ల కోసం వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా ? అనే విష‌యం తేలాల్సి ఉంది. నాయ‌కుల స్వ‌లాభం కోసం మాత్రమే ద‌ళిత కార్డును ఎత్తుకుంటున్నారా.. అనుమానాల‌ను విశ్లేష‌కులు లేవ‌నెత్తుతున్నారు. ఆది నుంచి అట్ట‌డుగున ఉన్న ద‌ళిత‌, గిరిజ‌న సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌ల స్థితి గ‌తులు మారేందుకు ఏమైనా అవ‌కాశం ఉందా? ఎన్నో రాజ‌కీయ పార్టీలు వారి ఎన్నిక‌ల స్టంట్‌గా ద‌ళిత‌, గిరిజ‌న, ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ఓట్ల కోసం వారిని మ‌భ్య పెట్టేందుకు గ‌తంలో అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాయి.


  ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ద‌ళిత వ‌ర్గాల ప్ర‌జ‌లను ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాడు. దీని ద్వారా ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పంపిణీ చేయ‌నున్నాట్టు ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం కోసం ల‌క్ష కోట్లు అయిన ఖ‌ర్చు పెట్టేందుకు వెన‌కాడ‌బోమ‌ని గులాబీ బాస్ తెగేసి చెప్పారు. ఈ ప‌థ‌కాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజ‌క‌వర్గంలో అమ‌లు చేస్తామ‌ని చేప్పారు. ఆ త‌రువాత ప్ర‌తిప‌క్షాలు ద‌ళిత బంధు కేవ‌లం రాజ‌కీయ స్వ‌లాభం కోసం ప్ర‌వేశ‌పెట్టార‌ని ఆరోపించారు. అయితే స్వ‌యంగా సీఎం కేసీఆర్ స్వ‌యంగా ద‌ళిత బంధు ను రాజ‌కీయం కోసం తీసుకొచ్చామ‌ని బ‌హిరంగంగా చెప్పారు. త‌రువాత దీన్ని వాసాల‌మ‌ర్రి గ్రామంలో మొద‌లు పెట్టారు కూడా.

  ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా ను ప్రారంభించింది. దీని ద్వారా తెలంగాణ‌తో పాటు హుజురాబాద్‌లో త‌మ పార్టీ జెండా ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు భావిస్తున్నారు. కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధుకు కౌంట‌ర్‌గా కాంగ్రెస్ ఈ ద‌ళిత‌, గిరిజ‌న దండోరా మోగించ‌నుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీని ద్వారా తెలంగాలోని 17 పార్ల‌మెంట‌రీ కేంద్రాల్లో స‌భ‌లు నిర్వ‌హించి ద‌ళిత‌, గిరిజ‌న హ‌క్కుల కోసం పోరాడుతామ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. సెప్పెంబ‌ర్ మొద‌టి వారంలో నిర్వ‌హించే స‌భ‌కు రాహుల్ గాంధీ హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. రేవంత్ ద‌ళితుల‌నే కాకుండా గిరిజ‌నుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కేసీఆర్ ద‌ళిత బంధుకు, రేవంత్ ద‌ళిత, గిరిజ‌న దండోరా ఏ మేర‌కు మ్యూజిక్ వినిపించ‌నుందో వేచి చూడాలి.
















ఏపీకి మూడురాజ‌ధానులుంటాయి

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>