SportsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-new-rules0a5879f1-a2d4-438f-88ef-b05bdc3eb488-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-new-rules0a5879f1-a2d4-438f-88ef-b05bdc3eb488-415x250-IndiaHerald.jpgక్రికెట్ ఆటలో అందరినీ ఆకట్టుకునే ఐపీఎల్ లీగ్ లో కొత్త రూల్స్ వచ్చేసాయి. కరోనా మహమ్మారి వల్ల ఐపీఎల్ మ్యాచ్లు అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లను సెప్టెంబర్ 19 ప్రారంభించనున్నారు. ఈ మ్యాచ్ లను అక్టోబర్ 15 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ - ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ పూర్తికాగానే టీమిండియా దుబాయ్ బాట పట్టనుంది. అయితే ఈసారి రెండో దశలో మొత్తం 31 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మిగిలిipl new rules{#}Cricket;Coronavirus;september;October;BCCI;England;India;Dubai;Chennai;Mumbai;Audienceఐపీఎల్ లో న్యూ రూల్స్..?ఐపీఎల్ లో న్యూ రూల్స్..?ipl new rules{#}Cricket;Coronavirus;september;October;BCCI;England;India;Dubai;Chennai;Mumbai;AudienceMon, 09 Aug 2021 13:30:00 GMTక్రికెట్ ఆటలో అందరినీ ఆకట్టుకునే ఐపీఎల్ లీగ్ లో కొత్త రూల్స్ వచ్చేసాయి. కరోనా మహమ్మారి వల్ల ఐపీఎల్ మ్యాచ్లు అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లను సెప్టెంబర్ 19 ప్రారంభించనున్నారు. ఈ మ్యాచ్ లను అక్టోబర్ 15 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ - ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ పూర్తికాగానే టీమిండియా దుబాయ్ బాట పట్టనుంది.

అయితే ఈసారి రెండో దశలో మొత్తం 31 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మిగిలిన 31 ఐపీఎల్ మ్యాచ్ లను పకడ్బందిగా నిర్వహించేందుకు బీబీసీఐ సరికొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇవి సెప్టెంబర్ 19న అమల్లోకి రానున్నాయి. ఆరోజున చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగనుంది. కోవిడ్-19 వ్యాధి సంక్రమించకుండా క్రికెట్ ఆటగాళ్లను సంరక్షించేందుకే ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేయనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. బ్యాట్స్ మెన్ బాల్ ని స్టేడియంలోని స్టాండ్స్ లో వెళ్లేలా సిక్సర్ కొడితే.. అదే బంతిని తిరిగి తీసుకొచ్చి ఆటను కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇకపై తాజా నిబంధనల ప్రకారం బంతి స్టాండ్స్ లోకి వెళ్ళినట్లయితే దానిని తిరిగి తీసుకు రారు. ఆ బంతిని క్రికెట్ ఆటగాళ్లు తాకను కూడా తాకరు. ఎందుకంటే బంతి స్టాండ్స్ లోకి వెళ్లి పడితే దానిని ప్రేక్షకులు ముట్టుకుంటారు. దీనివల్ల బంతికి కరోనా వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. ప్రేక్షకులు ఉండే ప్రాంతంలో పడే బంతికి కరోనా సోకవచ్చు.. అది క్రికెటర్లకు సోకే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ నిబంధన తేవడం వల్ల బ్యాట్ మెన్స్ లకు ప్రయోజనం కలుగుతుందని తెలుస్తోంది. కొత్త బంతిని కొట్టగానే శరవేగంగా పరుగులు తీస్తుంది. బౌండరీలు కొట్టడం కూడా చాలా సులభం అవుతుంది. దీనివల్ల బౌలర్లకు నష్టం జరిగే అవకాశం ఉంది. మరి బౌలర్లకు ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనేది ఐపీఎల్ మ్యాచ్ లు మొదలైన తర్వాత తెలుస్తుంది.


పులిచింతల ఘటన వైసీపీ పాపమే : యరపతినేని

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>