PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trs354b3238-70b6-457b-a174-e6e44c410901-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trs354b3238-70b6-457b-a174-e6e44c410901-415x250-IndiaHerald.jpgరాజ‌కీయాల్లో పార్టీలు మార‌డం సాధార‌ణ విష‌యం. నిన్న ఒక పార్టీలో రేపు ఇంకో పార్టీలో మ‌రుస‌టి రోజు తిరిగి సొంత గూటికి చేరుకునే నేత‌ల‌ను మ‌నం చూస్తూనే ఉంటాం. ఇదేం విచిత్రం అని ముక్కుమీద వేలేసుకుని చూస్తున్నా కొంద‌రు నాయ‌కుల‌కు ఇది స‌ర్వ‌సాధార‌ణం. పార్టీలో విభేదాల వ‌ల్ల కొంద‌రు పార్టీ మారితే, మ‌రి కొంద‌రు రాజ‌కీయంగా ఎద‌గ‌డం కోసం, టికెట్ ఆశించి జంప్ అవుతుంటారు. గ‌తంలో ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను తిట్టి మ‌ళ్లి అదే పార్టీ కండువా క‌ప్పుకుంటారు కొంద‌రు. ఇలా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిన నేత‌ల‌ను మ‌నం చtrs{#}anil music;Telangana Rashtra Samithi TRS;AdiNarayanaReddy;Deputy Chief Minister;CM;MLA;Reddy;District;Partyష‌ర్మిల పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే..?ష‌ర్మిల పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే..?trs{#}anil music;Telangana Rashtra Samithi TRS;AdiNarayanaReddy;Deputy Chief Minister;CM;MLA;Reddy;District;PartyMon, 09 Aug 2021 11:19:18 GMT రాజ‌కీయాల్లో పార్టీలు మార‌డం సాధార‌ణ విష‌యం. నిన్న ఒక పార్టీలో రేపు ఇంకో పార్టీలో మ‌రుస‌టి రోజు తిరిగి సొంత గూటికి చేరుకునే నేత‌ల‌ను మ‌నం చూస్తూనే ఉంటాం. ఇదేం విచిత్రం అని ముక్కుమీద వేలేసుకుని చూస్తున్నా కొంద‌రు నాయ‌కుల‌కు ఇది స‌ర్వ‌సాధార‌ణం. పార్టీలో విభేదాల వ‌ల్ల కొంద‌రు పార్టీ మారితే, మ‌రి కొంద‌రు రాజ‌కీయంగా ఎద‌గ‌డం కోసం, టికెట్ ఆశించి జంప్ అవుతుంటారు. గ‌తంలో ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను తిట్టి మ‌ళ్లి అదే పార్టీ కండువా క‌ప్పుకుంటారు కొంద‌రు. ఇలా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిన నేత‌ల‌ను మ‌నం చాలా మందినే చూస్తు ఉంటాం.. అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ష‌ర్మిల పార్టీ వైఎస్ఆర్‌సీపీటీ లోకి వెళ్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.


    అధికార పార్టీకి చెందిన స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య పార్టీ మారుతున్న‌ట్టు స‌మాచారం. ష‌ర్మిల పార్టీలో క‌లిసేందుకు సిద్ద‌మ‌వుతున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్ర‌చారానికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న లోట‌స్ పాండ్‌కు వెళ్లి ష‌ర్మిల భ‌ర్త అనిల్ ను క‌ల‌వ‌డ‌మే. దీంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి రాజ‌య్య దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వీరాభిమానిగా ఉన్నాడు.


తాజాగా తెలంగాణ‌లో ఆవిర్భ‌వించిన వైఎస్ఆర్‌సీపీటీ పార్టీలో చేరేందుకు చ‌ర్చించేందుకు రాజ‌య్య లోట‌స్ పాండ్‌కు వెళ్లి బ్ర‌ద‌ర్ అనీల్ ను క‌లిశాడా అనే ఊహాగానాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతున్నాయి. అయితే క్రిస్టియానిటికి చెందిన రాజ‌య్య ఆ వైపుగా అడుగులు వేస్తున్నాడా అనే అనుమానం క‌లుగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న క‌డియం శ్రీ‌హ‌రిది , తాటికొండ రాజ‌య్య‌ ఇదద్ద‌రిది ఒకే నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆది నుంచి వారు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నార‌నే విష‌యం అంద‌రికి తెలుసు.


అయితే ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌డియం ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్సీ గ‌డువు ముగుస్తుండ‌డంతో మ‌రొక సారి ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌ని సంకేతాలు వచ్చాయి. దీంతో అసంతృప్తిగా ఉన్న రాజయ్య ప్ర‌త్య‌మ్నాయ మార్గం వైపు చూస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగింది. అయితే బ‌హిరంగంగానే వాళ్లిద్ద‌రూ ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్నార‌నే విష‌యం అందరికి తెలిసిందే. క‌డియం కు పార్టీలో ప్రాధాన్య‌త పెర‌గ‌డంతో రాజ‌య్య ప్ర‌త్యామ్న‌యం వైపు చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే రాజ‌య్య ఏ విధమైన నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.







మహేష్ బాబు - సూర్యకు మధ్య వున్న బంధం ఏమిటి..?

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>