MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/happy-birthday-apple-beauty-hansika761d51d5-7522-4614-855f-087d7b0c51a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/happy-birthday-apple-beauty-hansika761d51d5-7522-4614-855f-087d7b0c51a6-415x250-IndiaHerald.jpgపాలమీగడ లాంటి అందం. పాలు.. పసుపు కలగలిసిన సొగసు. చెర్రీ పండ్ల లాంటి పెదవులు. వికసించే పుష్పం లాంటి నవ్వు.. ఇవన్నీ కలగలిస్తే హన్సిక. నేడు హన్సిక మోత్వానీ పుట్టిన రోజు. ఆమెకు ఇండియా హెరాల్డ్ బర్త్ డే విషెస్ చెబుతోంది.Happy Birthday Apple Beauty Hansika{#}Hansika Motwani;pradeep;Desamuduru;Kandireega;Joseph Vijay;kalyan ram;Hindi;Tollywood;Father;Hero;Jr NTR;Tamil;Teluguహ్యాపీ బర్త్ డే : ఆపిల్ బ్యూటీ హన్సిక !హ్యాపీ బర్త్ డే : ఆపిల్ బ్యూటీ హన్సిక !Happy Birthday Apple Beauty Hansika{#}Hansika Motwani;pradeep;Desamuduru;Kandireega;Joseph Vijay;kalyan ram;Hindi;Tollywood;Father;Hero;Jr NTR;Tamil;TeluguMon, 09 Aug 2021 06:00:00 GMTహన్సిక పూర్తి పేరు హన్సిక మోత్వానీ. ముంబయిలో 1991వ సంవత్సరం ఆగస్ట్ 9వ తేదీన జన్మించింది. తండ్రి పేరు ప్రదీప్ మోత్వానీ ఒక బిజినెస్ మెన్. తల్లి మోనా మోత్వానీ డెర్మటాలజిస్ట్. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. హన్సిక మాత్రం తల్లిదగ్గరే ఉంటోంది. హన్సిక తెలుగు, ఇంగ్లీష్, తుళు, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడుతుంది.  

హన్సిక బాలనటిగా పలు సీరియళ్లలోనూ.. సినిమాల్లోనూ తన ప్రతిభ కనుబరిచింది. షకలక బూమ్ బూమ్ .. హమ్ దో హై.. లాంటి సీరియళ్లలో బాలనటిగా మెప్పించింది. 2001లోనే బుల్లితెరకు పరిచయమైంది. అంతేకాదు కోయ్ మిల్ గయా, హవా, అబ్రకదబ్రా, జాగో లాంటి చిత్రాల్లో నటించింది. ఇక 2007వ సంవత్సరంలో తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. 2007లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు సినిమాలో 16ఏళ్ల వయసులో వెండితెరపై మెరిసింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది హన్సిక. ఆ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

2008లో జూనియర్ ఎన్టీఆర్ సరసన కంత్రీలో నటించింది. ఎనర్జిక్ హీరో రామ్ సరసన మస్కా సినిమాలో.. ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ఇరగదీసింది. ఇక బిల్లా చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో జయీభవ సినిమాలో నటించినా ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది. నితిన్ సరసన తెరకెక్కిన సీతారాముల కల్యాణం నిరాశపరిచింది. ఆ తర్వాత తమిళ్ లో అవకాశాలు చేజిక్కించుకుంది హన్సిక. వరుస ఫ్లాపులు ఎదురైనా నిరాశ చెందకుండా తన సినీ ప్రయాణం కొనసాగించింది. విజయ్ తో వెలాయుధం అనే మూవీలో నటించి హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత టాలీవుడ్ లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ.. ఓ మైఫ్రెండ్, దేనికైనా రెడీ, కందిరీగ లాంటి చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత 2013లో వచ్చిన సింగం2 అద్బుత నటన ప్రదర్శించి ప్రేక్షకులతో ప్రశంసలు అందుకుంది.












ఆరెస్పీ ప్రశ్న: కారు కిందపడతారా.. ఏనుగు ఎక్కుతారా..?

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>