MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/hansika-birthdayc21a71f1-6665-4355-a3e3-062f04dc2877-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/hansika-birthdayc21a71f1-6665-4355-a3e3-062f04dc2877-415x250-IndiaHerald.jpgతెలుగు పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ప్రేక్షకుల మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. వారిని చూస్తే మన పక్కింటి అమ్మాయిలాగా ఎంతో చక్కగా కలిసిపోతూ ఉంటారు. అలాంటివారిలో ఒక్కరే హన్సిక మోత్వాని. ఈ ముద్దుగుమ్మ 'దేశముదురు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి అభిమానులు చేత ముద్దుగా ఆపిల్ అని పిలిపించుకుంటోంది. HANSIKA BIRTHDAY{#}Hansika Motwani;Tamil;Blockbuster hit;Apple;bollywood;Telugu;Mumbai;Heroine;Tollywood;Love;mediaఅందంలోనే కాదు మానవత్వంలోనూ హన్సిక టాప్...అందంలోనే కాదు మానవత్వంలోనూ హన్సిక టాప్...HANSIKA BIRTHDAY{#}Hansika Motwani;Tamil;Blockbuster hit;Apple;bollywood;Telugu;Mumbai;Heroine;Tollywood;Love;mediaMon, 09 Aug 2021 13:00:00 GMTతెలుగు పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ప్రేక్షకుల మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. వారిని చూస్తే మన పక్కింటి అమ్మాయిలాగా ఎంతో చక్కగా కలిసిపోతూ ఉంటారు. అలాంటివారిలో ఒక్కరే హన్సిక మోత్వాని. ఈ ముద్దుగుమ్మ 'దేశముదురు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి అభిమానులు చేత ముద్దుగా ఆపిల్ అని పిలిపించుకుంటోంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకొని లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హన్సిక అంతకుముందు బాలీవుడ్ లో బాలనటిగా పలు చిత్రాల్లో నటించి పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో నటించి గుర్తింపు పొందింది.
అయితే టాలీవుడ్ లో కందిరీగ, మస్కా తదితర సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అయితే రాలేదు.  కానీ తెలుగులో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మద్య కాలంలో తెలుగులో ఈమెకు అవకాశాలు తగ్గడంతో తమిళ్ ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ ఆఫర్ ల మీద ఆఫర్లు అందుకుంటూ వరుస విజయాలను అందుకుంటోంది. అప్పట్లో నాకు మొత్తం శింబునే....నేను శింబుకే సొంతం, మేము లవ్ లో ఉన్నాం అంటు క్లారిటీ ఇచ్చింది. అయితే ఏమైందో ఏమో గాని అది కాస్త బ్రేక్ అప్ అవడంతో ఇప్పుడు నా దృష్టంతా కేవలం కెరియర్ పైనే అంటూ  ప్రకటించింది.
 అయితే ఇప్పటికే 50 సినిమాలకు పైగా నటించిన ఈమె నటన పరంగానే కాదు. గొప్ప మానవతావాదిగా కూడా పేరు తెచ్చుకుంది. తన ప్రతి పుట్టిన రోజుకి ఒక అబ్బాయి లేదా అమ్మాయిని దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె ఆగస్ట్ 9 న 1991 లో ముంబై లో జన్మించారు. నేడు ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఆమె కెరియర్, లైఫ్ స్టైల్ ఇలా ఆమె పలు రకాల విషయాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు ఆమె అభిమానులు. మరి ఈ పుట్టిన రోజున హన్సిక ఎవరిని దత్తతకు తీసుకుందో వివరాలు తెలియదు గాని ఇంత గొప్ప మనసున్న మా ఆపిల్ లైఫ్ ఎప్పుడూ చిరునవ్వులతో కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నేడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫాన్స్.
 


బోర్డ‌ర్ వ‌ద్ద టెన్ష‌న్‌.. చైనాకు దీటుగా భార‌త్ బ‌ల‌గాల మోహ‌రింపు..!

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

సింధు కాంస్యానికి మరో వైపు..

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>