PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcrc22bcdd6-d0c2-4455-b0d6-48c1da59536a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcrc22bcdd6-d0c2-4455-b0d6-48c1da59536a-415x250-IndiaHerald.jpgరాజకీయ వ్యూహాలు పన్నడంలో, ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో తెలంగాణలో కేసీఆర్‌ని మించినవారు లేరనే చెప్పొచ్చు. ఈయన వ్యూహాలకు ప్రత్యర్ధులు తల వంచాల్సిందే. అందుకే రెండు సార్లు టీఆర్ఎస్‌ని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఇలా ప్రత్యర్ధులని చిత్తు చేసే వ్యూహాలతో ముందుకొస్తున్న కేసీఆర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు.kcr{#}Elections;Cheque;revanth;Congress;Party;CM;KCR;Revanth Reddy;Telanganaకేసీఆర్ వ్యూహాలు రేవంత్‌కు ముందే ఎలా తెలుస్తున్నాయి?కేసీఆర్ వ్యూహాలు రేవంత్‌కు ముందే ఎలా తెలుస్తున్నాయి?kcr{#}Elections;Cheque;revanth;Congress;Party;CM;KCR;Revanth Reddy;TelanganaMon, 09 Aug 2021 13:09:00 GMTరాజకీయ వ్యూహాలు పన్నడంలో, ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో తెలంగాణలో కేసీఆర్‌ని మించినవారు లేరనే చెప్పొచ్చు. ఈయన వ్యూహాలకు ప్రత్యర్ధులు తల వంచాల్సిందే. అందుకే రెండు సార్లు టీఆర్ఎస్‌ని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఇలా ప్రత్యర్ధులని చిత్తు చేసే వ్యూహాలతో ముందుకొస్తున్న కేసీఆర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు.


అందుకే కేసీఆర్ వ్యూహాలని ముందే పసిగట్టి అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్‌ని తీసుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ మరొకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఖాయమని, 2023 మొదట్లోనే ఎన్నికలు జరుగుతాయని రేవంత్ స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ వ్యూహం రేవంత్‌ ముందే పసిగట్టారని చెప్పొచ్చు. అందుకే తాము కూడా 2023 ముందస్తు ఎన్నికలు లక్ష్యంగా పనిచేస్తున్నామని మాట్లాడుతున్నారు.


కాకపోతే తాను ముందస్తు ఎన్నికలంటే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని, తాను చెప్పినట్లే జరుగుతుందని అంటున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. గతంలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను చెప్పానని, అలాగే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేస్తున్నారు. ఇక ఈటల రాజేందర్‌ని పార్టీ నుంచి కేసీఆర్ బయటకు పంపిస్తారనే విషయాన్ని కూడా ముందే చెప్పానని అన్నారు. ఇక ఇటీవల కేటీఆర్‌కు సీఎం పీఠం ఇచ్చేస్తున్నారని, రేపో మాపో ప్రమాణస్వీకారం చేసేస్తారని, మీడియా, పలు పార్టీలు మాట్లాడాయని, కానీ తాను మాత్రం కేసీఆర్, ఇప్పుడే కేటీఆర్‌ని సీఎం చేయరని చెప్పానని, ఆ తర్వాత అలాగే జరిగిందని అంటున్నారు.


ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ముందస్తు ఎన్నికలు అని, 2022 డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, 2023 జనవరిలో ఎన్నికలకు వెళ్తారని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని చెబుతున్నారు. అందుకే 20 నెలల టార్గెట్‌గా పెట్టుకుని తాము కార్యాచరణని రూపొందించుకుంటున్నామని, ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులని సిద్ధం చేసి, కేసీఆర్‌ని గద్దె దించడమే తమ లక్ష్యమని అంటున్నారు. మరి ముందస్తు ఎన్నికల విషయంలో రేవంత్ చెప్పింది జరుగుతుందో లేదో చూడాలి.  




మహేష్ బాబు గురించి మీకు తెలియని విషయాలు ఇవే..?

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

సింధు కాంస్యానికి మరో వైపు..

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>