PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/railways3b3ea404-943a-4ae6-9800-49f383eaa2ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/railways3b3ea404-943a-4ae6-9800-49f383eaa2ff-415x250-IndiaHerald.jpgదేశాభివృద్ధిలో రైల్వేల పాత్ర అమోఘం.. ప్రజా రవాణాలోనూ.. సరకు రవాణాలోనూ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇండియాలో దోచుకున్న సంపద తరలింపు కోసం ఆనాడు బ్రిటీష్‌ వాళ్లు ప్రారంభించిన రైళ్లు.. ఇప్పుడు ఇండియా ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ రైళ్లు నడవాలంటే.. భారీగా ఇంధనం కావాలి. రైల్వేలు ప్రారంభమైన తొలి రోజుల నుంచి నిన్న మొన్నటి వరకూ బొగ్గు ద్వారానే రైళ్లు పరుగులు పెట్టేవి.. రైలు వెళ్తుంటో దాని వెనుక ఓ పొగ మేఘం కనిపించేది. కొన్నాళ్ల క్రితం నుంచి విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. అయితే విద్యుrailways{#}electricity;pollution;Adah Sharma;sampada;Aqua;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;Indiaభళా భారత్‌: ఇక హైడ్రోజన్ ద్వారా రైళ్ల పరుగులు ?భళా భారత్‌: ఇక హైడ్రోజన్ ద్వారా రైళ్ల పరుగులు ?railways{#}electricity;pollution;Adah Sharma;sampada;Aqua;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;IndiaMon, 09 Aug 2021 10:30:00 GMTదేశాభివృద్ధిలో రైల్వేల  పాత్ర అమోఘం.. ప్రజా రవాణాలోనూ.. సరకు రవాణాలోనూ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇండియాలో దోచుకున్న సంపద తరలింపు కోసం ఆనాడు బ్రిటీష్‌ వాళ్లు ప్రారంభించిన రైళ్లు.. ఇప్పుడు ఇండియా ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ రైళ్లు నడవాలంటే.. భారీగా ఇంధనం కావాలి. రైల్వేలు ప్రారంభమైన తొలి రోజుల నుంచి నిన్న మొన్నటి వరకూ బొగ్గు ద్వారానే రైళ్లు పరుగులు పెట్టేవి.. రైలు వెళ్తుంటో దాని వెనుక ఓ పొగ మేఘం కనిపించేది.


కొన్నాళ్ల క్రితం నుంచి విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. అయితే విద్యుత్ కూడా అంత సులభంగా దొరికేదేమీ కాదు.. ఆ విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా బొగ్గు కావాలి.. జల విద్యుత్‌ వనరులు పరిమితమే కదా.   అందుకే ఇప్పుడు నయా ఇంధనాలవైపు రైల్వే అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ అతి కొద్ది దేశాల్లోనే అమల్లో ఉన్న హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను రైల్వే శాఖ  వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. హైడ్రోజన్‌ ను ఇంధనంగా ఉపయోగించుకోవడమే టెక్నాలజీ చాలా కొత్తది.. అది కొద్ది దేశాల్లోనే ఈ టెక్నాలజీ వాడుతున్నారు.


ప్రస్తుతం జర్మనీ, పోలెండ్‌లో మాత్రమే ఇలా హైడ్రోజన్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఇంతకీ ఈ హైడ్రోజన్ ఎలా ఇంధనంగా ఉపయోగపడుతుంది.. ఈ విధానంలో సౌరశక్తి ద్వారా నీటి విద్యుద్విశ్లేషణ చేస్తారు. దీని ద్వారా హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ తోనే రైళ్లను నడుపుతారు. అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు.. ఆ టెక్నాలజీని ఇటీవలే సాధించిన ఇండియా.. ఈ కాలుష్యరహిత హరిత రవాణా ఇంధనాన్ని ప్రయోగాత్మకంగా వాడుతోంది.


హర్యానాలో 89 కిలోమీటర్లు నడిచే డెమూ రైలుకు హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను వినియోగించబోతోంది. ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే ఇకపై డీజిల్‌  రైళ్లన్నింటిలో  హైడ్రోజన్‌ ఇంధనం ఉపయోగిస్తారట. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒక్కో రైలుకు ఏటా 2 కోట్ల 30లక్షల విలువైన ఇంధనం ఆదా అవుతుందట. అంతే కాదు.. కర్బన ఉద్గారాలు ఏటా 11.12 కిలో టన్నుల నుంచి 0.72 కిలో టన్నులకు తగ్గిపోతాయి. ఆ మేరకు కాలుష్యం తగ్గుతుంది.



మహేష్ బాబు - సూర్యకు మధ్య వున్న బంధం ఏమిటి..?

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>