MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu2a8ab52e-6798-4dfa-8cf1-b1c06ae8af2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu2a8ab52e-6798-4dfa-8cf1-b1c06ae8af2c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరో గా ఉన్న మహేష్ బాబు తన కుటుంబం పై తీసుకునే శ్రద్ధ గురించి అందరికీ తెలిసిందే. సినిమా చేస్తున్నంతసేపు సినిమా వాడిగా ఇంట్లో ఉన్నంతసేపు ఫ్యామిలీ మెన్ గా ఉంటాడు మహేష్ బాబు. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ లో కుటుంబంతో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాడు. అలా వారితో విదేశాలకు వెళ్ళటం, సరదాగా గడపడం లాంటివి చేస్తూ ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మహేష్ బాబు ఆ తరువాత ఎన్నో సినిమాల ద్వారా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడmahesh babu{#}keerthi suresh;parasuram;Indira Gandhi;Khaleja;Father;Hero;krishna;prema;Love;marriage;mahesh babu;Cinemaమహేష్ బాబు కి అత్యంత ఇష్టమైన వ్యక్తులు ఎవరో తెలుసా ?మహేష్ బాబు కి అత్యంత ఇష్టమైన వ్యక్తులు ఎవరో తెలుసా ?mahesh babu{#}keerthi suresh;parasuram;Indira Gandhi;Khaleja;Father;Hero;krishna;prema;Love;marriage;mahesh babu;CinemaMon, 09 Aug 2021 10:49:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరో గా ఉన్న మహేష్ బాబు తన కుటుంబం పై తీసుకునే శ్రద్ధ గురించి అందరికీ తెలిసిందే. సినిమా చేస్తున్నంతసేపు సినిమా వాడిగా ఇంట్లో ఉన్నంతసేపు ఫ్యామిలీ మెన్ గా ఉంటాడు మహేష్ బాబు. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ లో కుటుంబంతో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాడు. అలా వారితో విదేశాలకు వెళ్ళటం, సరదాగా గడపడం లాంటివి చేస్తూ ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మహేష్ బాబు ఆ తరువాత ఎన్నో సినిమాల ద్వారా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు  మహేష్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా సాగుతోందని అంటున్నారు. ఇకపోతే మహేష్ బాబు కు ఇష్టమైన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. వారెవరో కాదు ఒకరు ఆయన తల్లి మరొకరు ఆయన భార్య. ఈ ఇద్దరు మహిళలు తన జీవితంలో సాధించిన ఎన్నో విషయాలకు కారణమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.

తండ్రి అంటే ఎంతో అపారమైన గౌరవం మహేష్ బాబు కు. ఎన్నో సందర్భాల్లో తండ్రి మీద ఉన్న ప్రేమ గురించి బయట పెట్టాడు. అయితే తన తల్లిని కాదని వేరే మహిళను పెళ్లి చేసుకున్నా కృష్ణ, ఆ తర్వాత కూడా మహేష్ బాబు ఇష్టాన్ని కోల్పోలేదు. ఇందిర తో విడాకులు తీసుకుని విజయనిర్మలను పెళ్లి చేసుకున్నాడు కృష్ణ. ఏదేమైనా మహేష్ కెరీర్ లో సినిమాలను ఏ విధంగా అయితే చూస్తాడో అంతకంటే ఎక్కువగా ఫ్యామిలీని చూసుకుంటూ బెస్ట్ ఫామిలీ మెన్ గా నిలిచిపోయాడు. అవసరమైతే తన కుటుంబం కోసం కొన్ని సంవత్సరాలు సినిమాలను ఆపి అయినా సరే వారితో గడుపుతారు. అతిథి తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు కుటుంబానికి అంకితం అయిపోయి ఆ తర్వాత ఖలేజా సినిమా చేశాడు. 



ఏనుగెక్కిన "ప్రవీణుడు" ప్రజల్లో నిలుస్తాడా..?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>