MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/real-superstar-mahesh-babu-6cf42c49-3560-471b-a6c9-7357c39c59b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/real-superstar-mahesh-babu-6cf42c49-3560-471b-a6c9-7357c39c59b9-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉండడమే కాదు అనేకమంది ప్రేక్షకులు సైతం ఆయనని ఎంతో ఇష్టపడుతుంటారు. ఇక మహేష్ కి లేడీస్ లో అయితే చెప్పలేనంత గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఎక్కడైనా మహేష్ తళుక్కుమని మెరిస్తే చాలు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు అన్ని కూడా వేలాదిమంది జనంతో కిక్కిరిసిపోతాయి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆ విధంగా తండ్రి కృష్ణ మాదిరిగా అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా తన అందం, అభినయంతో మెప్పించి మంచి క్రేజ్ దక్కించుకున్న మహేష్ బాబు తన కెరీర్ లో పలు కమర్షియలreal superstar mahesh babu {#}Srimanthudu;bharath;Sri Bharath;Ishtam;Audience;Heart;Telangana;Manam;maharshi;Maharshi;mahesh babu;Father;Rajani kanth;Andhra Pradesh'రీల్' పైనే కాదు 'రియల్' గా కూడా సూపర్ స్టార్ అని మహేష్ ని ఎందుకంటారంటే .... ??'రీల్' పైనే కాదు 'రియల్' గా కూడా సూపర్ స్టార్ అని మహేష్ ని ఎందుకంటారంటే .... ??real superstar mahesh babu {#}Srimanthudu;bharath;Sri Bharath;Ishtam;Audience;Heart;Telangana;Manam;maharshi;Maharshi;mahesh babu;Father;Rajani kanth;Andhra PradeshMon, 09 Aug 2021 14:37:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉండడమే కాదు అనేకమంది ప్రేక్షకులు సైతం ఆయనని ఎంతో ఇష్టపడుతుంటారు. ఇక మహేష్ కి లేడీస్ లో అయితే చెప్పలేనంత గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఎక్కడైనా మహేష్ తళుక్కుమని మెరిస్తే చాలు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు అన్ని కూడా వేలాదిమంది జనంతో కిక్కిరిసిపోతాయి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆ విధంగా తండ్రి కృష్ణ మాదిరిగా అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా తన అందం, అభినయంతో మెప్పించి మంచి క్రేజ్ దక్కించుకున్న మహేష్ బాబు తన కెరీర్ లో పలు కమర్షియల్, యాక్షన్, ప్రయోగాత్మక సినిమాలతో పాటు మరికొన్ని మెసేజ్ తో కూడిన సినిమాలు కూడా చేసారు.
ముఖ్యంగా ఆయన చేసిన మెసేజ్ సినిమాల్లో శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటివి మనం ఎప్పటికీ మరచిపోలేము. అయితే కేవలం రీల్ పైన తాను పోషించిన పాత్రలని ఇన్స్పి రేషన్ గా తీసుకుని పలు గొప్ప సామజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు మహేష్ బాబు. ఇప్పటి వరకు మొత్తంగా 1000 కి పైగా గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు తన గొప్ప మనసుతో శస్త్ర చికిత్సలు చేయించి వారికి ప్రాణం పోశారు. అంతే కాదు సినిమాలతో పాటు అనేక యాడ్ ఫిలిమ్స్ లో కూడా యాక్ట్ చేసే మహేష్ తనకు వచ్చే ఆదాయంలో ముప్పై శతాం డబ్బును పలు ఇతర సేవలకు నియోగిస్తుంటారు.
ఈ విషయమై మహేష్ గొప్పతనం, మంచితనం గురించి అనేకమంది ప్రముఖులు ఆయన పై ప్రశంసలు కురిపించడం జరిగింది. మరీ ముఖ్యంగా శ్రీమంతుడు మూవీ అంటే తనకు ఎంతో ఇష్టం అని తరచు చెప్తుండే మహేష్, ఆ సినిమాలోని కాన్సెప్ట్ ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం, అలానే తెలంగాణ లోని సిద్దాపురం గ్రామాలని దత్తత తీసుకుని తనవంతుగా అక్కడ పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాక ఇటీవల ఆయా గ్రామాల్లో వారికి ఉచిత కోవిడ్ టీకాలు కూడా వేయించి అందరి మనసు గెలుచుకున్నారు సూపర్ స్టార్. అందుకే మహేష్ బాబు ని రీల్ మీదనే కాక రియల్ గా కూడా సూపర్ స్టార్ అని అందరూ అంటూ ఉంటారు .... !!





ఫ్లాప్ అయినా మహేష్ స్టామినా చూపిన రెండు సినిమా లు..

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>