PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-541f7835-4edb-4f34-8594-1fa03d956dd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-541f7835-4edb-4f34-8594-1fa03d956dd1-415x250-IndiaHerald.jpgజగన్ చుట్టూ ఉన్న కోటరిలో అపరిపక్వత స్పష్టంగా ఉంది. ఆయన దీనిని నిలువరించలేకపోతున్నారు.ముఖ్యంగా రాజధాని విష యంలో ఆయన మాట్లాడుతున్నారో లేదా వారే తమకు తాముగా భావాలను నిర్ణయించుకుని మాట్లాడుతున్నారో కానీ ప్రజల ద గ్గర వీరంతా చులకన అయిపోతున్నారు అన్నది వాస్తవం.ఆ ఉద్యమం సరయింది అవునో కాదో ఎవరు తేల్చాలి ప్రజలు ఆ నిర్ణయం వారికే వదిలేయాలి..మీరు పట్టి పట్టి ఇది ఫేక్ అది ఫేక్ అని చెప్పడం సబబు కాదు. ys jagan {#}Yevaru;Delhi;Capital;Yatra;Jagan;mediaజగన్ కొంపముంచేది వారే?జగన్ కొంపముంచేది వారే?ys jagan {#}Yevaru;Delhi;Capital;Yatra;Jagan;mediaMon, 09 Aug 2021 10:48:11 GMTమంత్రులను నియంత్రించండి
లేదా మీరే వారి తరఫు
గొంతు వినిపించండి జగన్ !

జగన్ చుట్టూ ఉన్న కోటరిలో అపరిపక్వత స్పష్టంగా ఉంది. ఆయన దీనిని నిలువరించలేకపోతున్నారు.ముఖ్యంగా రాజధాని విష యంలో ఆయన మాట్లాడుతున్నారో లేదా వారే తమకు తాముగా భావాలను నిర్ణయించుకుని మాట్లాడుతున్నారో కానీ ప్రజల ద గ్గర వీరంతా చులకన అయిపోతున్నారు అన్నది వాస్తవం.ఆ ఉద్యమం సరయింది అవునో కాదో ఎవరు తేల్చాలి ప్రజలు ఆ నిర్ణయం వారికే వదిలేయాలి..మీరు పట్టి పట్టి ఇది ఫేక్ అది ఫేక్ అని చెప్పడం సబబు కాదు. ఏ ఉద్యమం అయినా ఏదో బాధ నుంచో అసం తృప్తతల నుంచో పుట్టుకువస్తుంది. మీరు ఓదార్పు యాత్ర చేసినప్పుడో లేదా దీక్షలు చేపట్టినప్పుడో కూడా ఏవో విమర్శలు రేగే ఉం టాయి. కానీ  ఆ రోజు మీ బాధను చెప్తున్నారు అన్నదే అక్కడ ప్రామాణికంగా తీసుకుని చాలా మంది మీ సానుభూతి పరులుగా మారారు. మీ వెంటే నడిచారు కూడా!

రాజధాని అనే కాదు ఢిల్లీ పరిణామాల్లో కూడా అపరిపక్వ ధోరణి కారణంగా తరుచూ మీడియా బ్యాటిల్ లో ఓడిపోతున్నారు. తీసు కునే నిర్ణయాలకు సంబంధిత ప్రయోజనాలకూ మధ్య దూరం అన్నది ఉండకూడదు.అదేవిధంగా మంత్రులు ఇంకా సబ్జెక్టివ్ గా మాట్లాడగలగాలి.ఇప్పటికీ ఆర్థిక అంశాలపై పట్టు లేదు.ఇప్పటికీ శాఖా పరమైన అంశాలపై పట్టు లేదు. పదవి లేదన్న నిర్వేద మూ, పదవి ఉందన్న నిర్వేదమూ రెండూ ఒక్కటే! జగన్ ఇలాకాలో! జిల్లాలలో మంత్రులకు తెలియకుండానే కొన్ని పనులు జరిగిపోతున్నాయి.ఇది కూడా అపరిపక్వతే! ఎవరైతే మాకేంటి అన్న ధోరణిలో కొందరు ఉంటూ లెక్క చేయని ధోరణిలో ప్రవర్తిస్తూ ఏకపక్ష వైఖరి ఒకటి పాటిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.వీటిని జగన్ అడ్డుకోలేకపోతున్నారు.సోషల్ మీడియా స్టేట్మెంట్లు కూడా అపరిపక్వంగానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇంకా పాలనపై పట్టు లేకపోవడం ఓ సమస్య.
ఈ సమస్య కారణంగానే జగన్ చుట్టూ ఉన్న వారు జగన్ తో సహా జిల్లాలో పనిచేస్తూ ఉన్నవారు చిక్కుల్లో పడుతున్నారు. రాజధాని  అనే తేనెతుట్టను కదపకుండా ఉంటే మేలు. కానీ ఆయన ఎవరి మాట ప్రకారం మూడు రాజధానులు ప్రకటించి సమ స్యల్లో ఇరుక్కు పోయారు. ఇప్పుడది తేలని విషయమై కూర్చొంది. అపరిష్కృత సమస్యలు జగన్ ప్రభుత్వంలో ఇదొక్కటే కాదు  చాలా ఉన్నాయి..వాటికి  సమాధానాలు ఇప్పుడు చెప్పలేక, చెప్పినా ఒప్పించే ధోరణిలో  చెప్పలేక సతమతమవుతున్నారు..వైసీపీ వర్గీయులు.





మహేష్ బాబు - సూర్యకు మధ్య వున్న బంధం ఏమిటి..?

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>