MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-how-many-movies-have-you-starred-in-in-superstar-krishna642c3372-dabf-44dc-9e1d-bd8aefd20034-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-how-many-movies-have-you-starred-in-in-superstar-krishna642c3372-dabf-44dc-9e1d-bd8aefd20034-415x250-IndiaHerald.jpgఎంతో మంది అమ్మాయిల మ‌నుసు దోచుకుని, ఇప్ప‌టికీ యువ‌కుడిలాగా క‌నిపిస్తాడు ప్రిన్స్ మ‌హేష్ బాబు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు పొందాడు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు మ‌హేష్‌. బాల నటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఈ యువ‌రాజు త‌న తండ్రితో క‌లిసి 10 చిత్రాల్లో న‌టించాడు. బాలనటుడిగా 7 చిత్రాల్లో కలిసి నటించ‌గా, హీరో అయ్యాక మూడు చిత్రాల్లో కలిసి న‌టించారు. అవేంటో చూద్prince mahesh babu{#}jeevitha rajaseskhar;kodi ramakrishna;ramesh babu;Jayanth C Paranjee;dasari narayana rao;prince;vamsi;Chitram;Rajani kanth;krishna;Hero;Father;mahesh babu;Cinemaమ‌హేష్ బాబు - సూప‌ర్ స్టార్ కృష్ణ క‌ల‌యిక‌లో ఇన్ని సినిమాలు వ‌చ్చాయా?మ‌హేష్ బాబు - సూప‌ర్ స్టార్ కృష్ణ క‌ల‌యిక‌లో ఇన్ని సినిమాలు వ‌చ్చాయా?prince mahesh babu{#}jeevitha rajaseskhar;kodi ramakrishna;ramesh babu;Jayanth C Paranjee;dasari narayana rao;prince;vamsi;Chitram;Rajani kanth;krishna;Hero;Father;mahesh babu;CinemaMon, 09 Aug 2021 07:53:32 GMT ఎంతో మంది అమ్మాయిల మ‌నుసు దోచుకుని, ఇప్ప‌టికీ యువ‌కుడిలాగా క‌నిపిస్తాడు ప్రిన్స్ మ‌హేష్ బాబు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు పొందాడు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు మ‌హేష్‌. బాల నటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఈ యువ‌రాజు త‌న తండ్రితో క‌లిసి 10 చిత్రాల్లో న‌టించాడు. బాలనటుడిగా 7 చిత్రాల్లో కలిసి నటించ‌గా, హీరో అయ్యాక మూడు చిత్రాల్లో కలిసి న‌టించారు. అవేంటో చూద్దాం.


  దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’ చిత్రంతో మహేష్ బాబు బాలనటుడిగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోరాటం’ సినిమాలో మహేష్ బాబు తొలిసారి కలిసి నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిల‌బ‌డింది. `శంఖారావం` సినిమాలో త‌న తండ్రి కృష్ణ‌తో రెండోసారి మ‌హేష్‌బాబు న‌టించాడు. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి హిట్ గా నిలిచింది.
రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా నటించిన చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో క‌నిపించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్‌గా నటించారు. ఈ సినిమాలో తన జీవిత పాత్రలో కృష్ణ కనిపించడం మ‌రో విశేషం. వీళ్లిద్దరు కలిసి నటించిన  మూడో  చిత్రం ఇది.

  ‘ముగ్గురు కొడుకులు’ సినిమాలో మహేష్ బాబు నాలుగో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా న‌టించారు. ఈ చిత్రం కూడా కూడా కృష్ణ దర్శకత్వంలో రూపిందించారు. కోడి రామ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గూఢ‌చారి 117 సినిమా మ‌హేష్ బాబు, సూప‌ర్ స్టార్ కృష్ణ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఐదో చిత్రం. ఇందులో హీరోతో స‌మానంగా డాన్సులు, ఫైట్ సీన్లు చేసి ప్రేక్ష‌క‌ల‌ను అల‌రించారు మ‌హేష్‌. ఆరో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో కలిసి నటించారు   మహేష్ బాబు. ఈ చిత్రంలో మహేష్ డ్యూయల్ రోల్ లో న‌టించారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.

 ఏడో సారి మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘అన్నాతమ్ముడు’ సినిమాలో నటించారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా మంచి విజ‌యాన్ని అందుకుంది. మ‌హేష్‌బాబు త‌న తండ్రి తో క‌లిసి న‌టించిన ఎనిమిదో సినిమా `రాజ కుమారుడు`. ఈ సినిమాలో కృష్ణ అతిథి పాత్ర‌లో క‌నిపించారు.  ‘వంశీ’ సినిమాలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, కృష్ణ క‌లిసి న‌టించిన సినిమాలో తొమ్మ‌దో చిత్రం. బి.గోపాల్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ వంశీ చిత్రంలో న‌మ్ర‌త కూడా న‌టించడం విశేషం.

  మహేష్ బాబు త‌న తండ్రి కృష్ణ కాంబోలో వ‌చ్చిన పదో సినిమా ‘టక్కరి దొంగ’.  ఈ చిత్రంలో కృష్ణ సినిమా క్లైమాక్స్‌లో మాత్ర‌మే కాసేపు కనిపించి వారి అభిమానులను అలరించారు.  `ట‌క్క‌రి దొంగ‌` సినిమా త‌రువాత తండ్రి కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది.



అధికారం ఉన్న‌వారికి కూడా థ‌ర్డ్‌డిగ్రీ త‌ప్ప‌దా?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>