MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaman-allu-arjun-7d7c33d4-cc19-4cc8-afc9-c8e44683b86a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaman-allu-arjun-7d7c33d4-cc19-4cc8-afc9-c8e44683b86a-415x250-IndiaHerald.jpg"అల వైకుంఠపురములో" చిత్రంతో అల్లు అర్జున్ తన కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ భారీ విజయం సాధించడంలో చార్ట్ బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ కూడా చాలా వరకు దోహదం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి పాటలన్నిటినీ తమన్ తనదైన శైలిలో అద్భుతంగా స్వర పరిచారు. "బుట్ట బొమ్మ" సాంగ్ బాలీవుడ్ లో పెద్ద ఎత్తున సర్క్యూట్ కావడమే కాకుండా బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. అలాంటి మ్యూజికల్ హిట్ ను ఇచ్చిన తమన్ ను ఐకాన్ స్టార్ ఇప్పుడు మర్చిపోతున్నాడు. అలా ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను అల్లు అThaman; Allu Arjun;{#}Allu Arjun;anirudh ravichander;sriram;India;sree;bollywood;Music;thaman s;Chitram;Cinema;Directorతమన్ ని బన్నీ పక్కన పెట్టేశాడా ?తమన్ ని బన్నీ పక్కన పెట్టేశాడా ?Thaman; Allu Arjun;{#}Allu Arjun;anirudh ravichander;sriram;India;sree;bollywood;Music;thaman s;Chitram;Cinema;DirectorMon, 09 Aug 2021 19:00:00 GMT"అల వైకుంఠపురములో" చిత్రంతో అల్లు అర్జున్ తన కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ భారీ విజయం సాధించడంలో చార్ట్ బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ కూడా చాలా వరకు దోహదం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి పాటలన్నిటినీ తమన్ తనదైన శైలిలో అద్భుతంగా స్వర పరిచారు. "బుట్ట బొమ్మ" సాంగ్ బాలీవుడ్ లో పెద్ద ఎత్తున సర్క్యూట్ కావడమే కాకుండా బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. అలాంటి మ్యూజికల్ హిట్ ను ఇచ్చిన తమన్ ను ఐకాన్ స్టార్ ఇప్పుడు మర్చిపోతున్నాడు. అలా ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను అల్లు అర్జున్ పక్కన పెట్టేయడానికి కారణం తమన్ వరుస చిత్రాలతో బిజీగా ఉండడమే అని తెలుస్తోంది.

ప్రస్తుతం బన్నీ "పుష్ప" చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి కూడా తమన్ నే తీసుకుంటాడని అంతా భావించారు. కానీ ఈ పాన్ ఇండియా మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. "పుష్ప - పార్ట్ 1" తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందనున్న "ఐకాన్" సెట్స్ లో చేరబోతున్నారు. ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. నిజానికి బన్నీ "నా పేరు సూర్య" తరువాత నటించాల్సిన చిత్రమిది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ ఇచ్చిన షాక్ తో "ఐకాన్"ను పక్కన పెట్టి మిగతా ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపాడు స్టైలిష్ స్టార్. ఇక ఇప్పుడు "ఐకాన్"కు టైం వచ్చిందన్నమాట. లేటెస్ట్ బజ్ ఏమిటంటే "ఐకాన్" కోసం కూడా బన్నీటీం తమన్ ను కాకుండా అనిరుధ్ రవిచందర్ లేదా బాలీవుడ్ మ్యూజిషియన్‌ని తీసుకోవాలని భావిస్తోందట. "అల వైకుంఠపురములో"తో బన్నీకి ఇప్పటి వరకు అతి పెద్ద మ్యూజికల్ హిట్ ఇచ్చిన తమన్ కు ఇప్పుడు మళ్లీ బన్నీతో పని చేసే అవకాశం రాకపోవడం వింతగా అనిపిస్తుంది. సాధారణంగా మన స్టార్స్ హిట్ ఇచ్చిన టెక్నిషియన్లను రిపీట్ చేస్తూ ఉంటారు కదా మరి...!





అందుకే మా వాడిని టార్గెట్ చేశారు : సునీల్ ఫ్యామిలీ

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>