MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-allu-arjun-aa48b624b8-ae46-4289-8249-36594c19db66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-allu-arjun-aa48b624b8-ae46-4289-8249-36594c19db66-415x250-IndiaHerald.jpgసినీ హీరోల అభిమానులు తమ ఫేవరేట్ హీరోలను పులులు, సింహాలతో పోల్చుతూ ఆరాధిస్తూ ఉంటారనే సంగతి మ‌న‌కు తెలిసిందే. ఈ క్రమంలో మ‌న హీరోలు డైలాగ్‌లలో పులులు, సింహాల‌తో పోల్చి హీరోయిజం చూపిస్తుంటారు. ఇది ఒక్క టాలీవుడ్‌లోనే కాదు అన్ని ఇండస్ట్రీలలో ఈ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. కాకపోతే ఇవే అభిమానుల యుద్దానికి దారి తీస్తుంటాయి. మా హీరో పులి అంటే మా హీరో సింహం అంటూ లొల్లి పెట్టుకుంటారు. ఇండస్ట్రీలో మళ్ళీ టైగర్స్ ట్రెండ్ వ‌చ్చేసింది. విష‌యానికి వ‌స్తే..'పుష్ప' సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' కు సంబంధించmahesh; allu arjun ;aa{#}Chicken;Makar Sakranti;Allu Arjun;Hero;mahesh babu;Rajani kanth;CBN;Cinemaమళ్ళీ స్టార్ట్ అయినా టైగర్స్ ట్రెండ్..?మళ్ళీ స్టార్ట్ అయినా టైగర్స్ ట్రెండ్..?mahesh; allu arjun ;aa{#}Chicken;Makar Sakranti;Allu Arjun;Hero;mahesh babu;Rajani kanth;CBN;CinemaMon, 09 Aug 2021 14:17:56 GMTసినీ హీరోల అభిమానులు తమ ఫేవరేట్ హీరోలను పులులు, సింహాలతో పోల్చుతూ ఆరాధిస్తూ ఉంటారనే సంగతి మ‌న‌కు తెలిసిందే. ఈ క్రమంలో మ‌న హీరోలు డైలాగ్‌లలో పులులు, సింహాల‌తో పోల్చి హీరోయిజం చూపిస్తుంటారు. ఇది ఒక్క టాలీవుడ్‌లోనే కాదు అన్ని ఇండస్ట్రీలలో ఈ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. కాకపోతే ఇవే అభిమానుల యుద్దానికి దారి తీస్తుంటాయి. మా హీరో పులి అంటే మా హీరో సింహం అంటూ లొల్లి పెట్టుకుంటారు.
ఇండస్ట్రీలో మళ్ళీ టైగర్స్ ట్రెండ్ వ‌చ్చేసింది.
 
విష‌యానికి వ‌స్తే..'పుష్ప' సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' కు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో వచ్చింది. ఇందులో 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక' అనే లైన్స్ మహేష్ బాబు ని ఉద్దేశిస్తూ పెట్టినవే అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలలో లొల్లి లొల్లి చేస్తున్నారు. బన్నీ పులి అని.. మహేష్ మేక అని ఆ పాట‌లోని అర్థంగా ఉంద‌ని కామెంట్స్ చేశారు. గతేడాది సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద మహేష్ - అల్లు అర్జున్ పోటీ పడగా.. ఆ సమయంలో 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'పులొచ్చింది.. మేక చచ్చింది' డైలాగ్ ను చూసి ఇలానే అభిమానులంతా గోల గోల చేశారు.

ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు బర్త్ డే పేరుతో ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో 'టైగర్' 'రాబిట్' లను కంపేర్ చేస్తూ మహేష్ చెప్పిన డైలాగ్  అద‌ర‌గొడుతోంది అభిమానుల‌ను. అదే సమయంలో ఇక్కడ టైగర్ అంటే మహేష్ అని.. కుందేలు అల్లు అర్జున్ అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు మ‌హేష్ అభిమానులు. గతంలో 'ఆగడు' సినిమా స‌మ‌యంలో కూడా ఇలాంటివే అనేకంగా జరిగాయి. అందులో మహేష్ చెప్పిన 'డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడ కొట్టిందట' 'ప్రతివాడు పులులు సింహాలతో ఎదవ కంపేరిజన్స్' వంటి డైలాగ్స్ ను మ‌హేష్ బాబు చెప్పాడు. దాంతో అభిమానులు ఇతర హీరోలకు అన్వ‌యిస్తూ ట్రోల్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమాలో డైలాగ్స్ ను బట్టి హీరోల అభిమానులు సోషల్ మీడియాలో యుద్దానికి దిగుతారు. కానీ నిజానికి మన హీరోలు కావాలని చేయ‌రు. ఫ్యాన్స్ ని ఆనంద‌పరచడానికే దర్శక, రచయితలు సంభాషణలు రాస్తుంటారు. ఇవేమీ ఆలోచించ‌కుడా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో యుద్ధానికి దిగి లొల్లి లొల్లి చేస్తుంటారు.



మహేష్ బాబు గురించి మీకు తెలియని విషయాలు ఇవే..?

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

సింధు కాంస్యానికి మరో వైపు..

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>