HealthChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/srirajreddy-the-spiritual-goddess-of-thousands-of-autism-children3d01f081-5ece-41ff-bb70-bcadbf266124-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/srirajreddy-the-spiritual-goddess-of-thousands-of-autism-children3d01f081-5ece-41ff-bb70-bcadbf266124-415x250-IndiaHerald.jpgపినాకిల్ బ్లూమ్ నెట్‌వర్క్‌కు చెందిన (శిశు అభివృద్ధి, మానసిక వికాసం కేంద్రం) ఆటిజం థెరపీ కేంద్రాన్ని ఈరోజు ఆగష్టు 9వ తారీఖున గుంటూరు లోని లక్ష్మీ పురంలో ప్రారంభించారు. మానసిక ఆందోళన తో బాధ పడే చిన్నారులకు మెరుగైన చికిత్స కల్పించే దిశగా పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్ శత విధాలా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది పిల్లలు మానసిక అభివృద్ధి, నాడీ వ్యవస్థ లోపం కారణంగా బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా.. ప్రజా సాధికారత సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో పpinnacle blooms{#}Vishakapatnam;Lakshmi Devi;raja;August;Parents;Minister;Telugu;Gunturగుంటూరులో 'పినాకిల్ బ్లూమ్స్'.. వారి బాధ తీర్చడమే లక్ష్యం!గుంటూరులో 'పినాకిల్ బ్లూమ్స్'.. వారి బాధ తీర్చడమే లక్ష్యం!pinnacle blooms{#}Vishakapatnam;Lakshmi Devi;raja;August;Parents;Minister;Telugu;GunturMon, 09 Aug 2021 21:20:51 GMTపినాకిల్ బ్లూమ్ నెట్‌వర్క్‌కు చెందిన (శిశు అభివృద్ధి, మానసిక వికాసం కేంద్రం) ఆటిజం థెరపీ కేంద్రాన్ని ఈరోజు ఆగష్టు 9వ తారీఖున గుంటూరు లోని లక్ష్మీ పురంలో ప్రారంభించారు. మానసిక ఆందోళన తో బాధ పడే చిన్నారులకు మెరుగైన చికిత్స కల్పించే దిశగా పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్ శత విధాలా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది పిల్లలు మానసిక అభివృద్ధి, నాడీ వ్యవస్థ లోపం కారణంగా బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా.. ప్రజా సాధికారత సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో పినాకిల్ ఆటిజం థెరపీ సెంటర్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చాలా చోట్ల  పునరావాస సౌకర్యాలు కల్పిస్తోంది.

 

 

ఇక తాజాగా గుంటూరులో ప్రారంభమయిన ఈ ఆటిజం థెరపీ సెంటర్‌ లో న్యూరోడైవర్సిటీని ప్రోత్సాహించడానికి అత్యాధునిక సేవలు, ఇన్ క్లాస్ క్లినికల్ కేర్ అందిస్తున్నారు. స్పెషలిస్టుల ఆధ్వర్యం లో పిల్లల మానసిక వికాసాన్ని పెంచే విధంగా శిక్షణ కల్పిస్తోంది. ఇందులో ఆటిజం థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్‌తో బాధ పడుతున్న పిల్లలకు ప్రత్యేక చికిత్స చేస్తారు. అలాగే విద్య, డ్యాన్స్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, యోగ థెరపీ, హైడ్రో థెరపీ, ఫిజియో థెరపీ, అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కర్షన్స్ వంటి సేవలు కూడా కల్పిస్తారు. 

 

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్ సేవలు పొందేందుకు ఉచిత జాతీయ హెల్ప్ లైన్ నెంబర్: 9100 181181 కూడా అందుబాటులో ఉంది.  ఇక ఈరోజు ప్రారంభ వేడుకలో పాల్గొన్న  మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న చిన్నారులకు పినాకిల్ బ్లూమ్స్ ద్వారా అధునాతనమైన థెరపీ అందించడం శుభపరిణామమని అన్నారు. పిల్లల్లో ఎదుగుదల లోపం కారణంగా తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారని వారికి ఊరట కలిగేలా  పినాకిల్ బ్లూమ్స్ మరిన్ని కేంద్రాలు  ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ఇప్పటికే విశాఖ పట్నం, విజయవాడలో సేవలు అందిస్తున్న సంస్థ ఇప్పుడు గుంటూరు జిల్లా వారి కోసం ఇక్కడ కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 

 

 




ఎన్టీఆర్ మామకు ఆ సీటు ఫిక్స్ చేస్తారా?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>