PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp8ff5411f-0db8-4935-835a-4768b9250ec7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp8ff5411f-0db8-4935-835a-4768b9250ec7-415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీకి 22 మంది ఎంపీలు బలం ఉంటే...అందులో మంచి పనితీరు కనబర్చేవారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారనే చెప్పొచ్చు. ఏదో జగన్ గాలిలో కొందరు రాజకీయాల్లో పెద్ద ఫాలోయింగ్ లేకపోయినా సరే గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచేశారు. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎంపీలు...తర్వాతైన సొంత ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నాలు చేశారా? అంటే పెద్దగా లేదనే చెప్పొచ్చు.ysrcp{#}geetha;MP;Anakapalle;Parliment;kakinada;Araku Valley;Jaganఆ లేడీ ఎంపీలకు మళ్ళీ గెలవడం కష్టమేనా?ఆ లేడీ ఎంపీలకు మళ్ళీ గెలవడం కష్టమేనా?ysrcp{#}geetha;MP;Anakapalle;Parliment;kakinada;Araku Valley;JaganMon, 09 Aug 2021 14:18:00 GMTఅధికార వైసీపీకి 22 మంది ఎంపీలు బలం ఉంటే...అందులో మంచి పనితీరు కనబర్చేవారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారనే చెప్పొచ్చు. ఏదో జగన్ గాలిలో కొందరు రాజకీయాల్లో పెద్ద ఫాలోయింగ్ లేకపోయినా సరే గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచేశారు. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎంపీలు...తర్వాతైన సొంత ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నాలు చేశారా? అంటే పెద్దగా లేదనే చెప్పొచ్చు.


అలాగే లోక్‌సభలో రాష్ట్రం తరుపున బలమైన వాయిస్ వినిపించారా? అంటే అది కూడా లేదనే చెప్పొచ్చు. అసలు కొందరు ఎంపీలు అయితే లోక్‌సభలో పెద్దగా హైలైట్ కాలేదు...ఇటు సొంత పార్లమెంట్ స్థానాల్లో కూడా హైలైట్ కాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా వైసీపీకి ఉన్న లేడీ ఎంపీలు ఈ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ గాలిలో అరకు నుంచి గొడ్డేటి మాధవి, అనకాపల్లి నుంచి బీశెట్టి సత్యవతి, కాకినాడ నుంచి వంగా గీత, అమలాపురం నుంచి చింతా అనురాధాలు ఎంపీలు గెలిచారు.


మరి ఎంపీలు గెలిచాక వీరు పార్లమెంట్‌లో  ఏ స్థాయిలో రాష్ట్రం కోసం పోరాటం చేశారంటే? పెద్దగా పోరాటం చేసినట్లే కనిపించలేదు. పైగా ఇటీవల పార్లమెంట్ ఎంపీల మీద జరిగిన సర్వేలో వీరు పూర్తిగా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ హాజరుశాతంలో, డిబేట్లలో పాల్గొనడంలో వీరు లాస్ట్‌లో ఉన్నారు. ఒక్క ప్రశ్నలు అడగడంలో మాత్రం వంగా గీత ముందున్నారు.


అయితే స్థానికంగా తమ పార్లమెంట్ ప్రజలకు అందుబాటులో ఉండటంలో కూడా ఈ లేడీ ఎంపీలు వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే..ఇందులో ఒకరిద్దరు ఎంపీలు అనే సంగతి సొంత పార్లమెంట్‌లోనే ప్రజలకు తెలియదని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇలా ఎంపీలుగా మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోతున్న ఈ నలుగురు లేడీ ఎంపీలకు నెక్స్ట్ గెలిచే అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లోపు ఈ లేడీ ఎంపీలు పుంజుకుంటారేమో చూడాలి.  




మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

సింధు కాంస్యానికి మరో వైపు..

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>