MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-titile-problems-e2bd8b64-45ba-44ae-b65d-1c5ca3c03f1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-titile-problems-e2bd8b64-45ba-44ae-b65d-1c5ca3c03f1b-415x250-IndiaHerald.jpgఉత్తరాది సినిమాలంటే ప్రేక్షకుల ఆశలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. కోట్ల రూపాయల ఖర్చుతో తీసే సినిమాలు కాబట్టి.. సినిమా కథ ఏ రేంజ్ లో ఉంటుందోనని మాట్లాడుకుంటుంటారు. తీరా చూస్తే.. ఒక విషయంలో విమర్శలు మొదలవుతున్నాయి. మళ్లీ సరిదిద్దుకుంటే గానీ ప్రాజెక్ట్ ట్రాక్ లో పడటం లేదు. bollywood titile problems {#}Irrfan Khan;Kangana Ranaut;Karthik;deepika;sujeeth;Rajiv Gandhi;Culture;Journey;Traffic police;Cinemaకోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ లో కొత్త గొడవలు..!కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ లో కొత్త గొడవలు..!bollywood titile problems {#}Irrfan Khan;Kangana Ranaut;Karthik;deepika;sujeeth;Rajiv Gandhi;Culture;Journey;Traffic police;CinemaSun, 08 Aug 2021 08:45:00 GMTబాలీవుడ్‌ పెద్ద పెద్ద చిత్రాలనే తెరకెక్కిస్తుంది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. అయితే ఇలాంటి ఇండస్ట్రీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొత్త సమస్యలను ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బందులే పడుతున్నారు నార్త్ మేకర్స్. రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణేకి సూపర్ హిట్ జోడీ ఇమేజ్‌ని తీసుకొచ్చిన సినిమా ' గోలియోంకి రాస్‌లీలా రామ్‌లీలా'. ఈ మూవీ టైటిల్‌ విషయంలోనూ గొడవలు జరిగాయి. మొదట ఈ సినిమాకి 'రామ్‌లీలా' అనే పేరు పెట్టాడు భన్సాలి. అయితే కొన్ని హిందూ సంస్థలు, మనోభావాలు దెబ్బతీంటున్నాయని ఆందోళన చేశారు. దీంతో రామ్‌లీలాని కాస్తా 'గోలియోంకి రాస్‌లీలా..రామ్‌లీలా' అని మార్చాడు సంజయ్ లీలా భన్సాలి. వివాదాలతో ఎప్పుడూ జర్నీ చేసే కంగన రనౌత్‌ సినిమా కూడా టైటిల్‌ వివాదాల్లో చిక్కుకుంది. ఇమ్రాన్ ఖాన్, కంగన లీడ్‌ రోల్స్‌లో 'సాలి కుటియా' అనే సినిమా రూపొందింది. అయితే రిలీజ్‌ టైమ్‌లో టైటిల్‌పై ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఈ మూవీ టైటిల్‌ని 'కట్టి బట్టి'గా మార్చారు.

షారుఖ్ ఖాన్ నిర్మాణంలో ఇర్ఫాన్ ఖాన్ లీడ్‌ రోల్ ప్లే చేసిన సినిమా 'బిల్లు బార్బర్'. అయితే రిలీజ్‌ టైమ్‌లో బార్బర్‌ కమ్యూనిటీ నుంచి సినిమా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో లాస్ట్ మినిట్‌లో 'బిల్లు బార్బర్' నుంచి బార్బర్ అనే పదం తొలిగించి 'బిల్లు' పేరుతో సినిమా విడుదల చేశాడు షారుఖ్. రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో జాన్‌ అబ్రహం చేసిన సినిమా 'మద్రాస్ కేఫ్'. సుజిత్ సర్కార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విషయంలోనూ టైటిల్ గొడవలు జరిగాయి. మొదట ఈ సినిమాకి 'జఫ్‌నా' అనే టైటిల్ పెట్టారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల ఆందోళనలు, పొరుగుదేశం శ్రీలంకతో సంబంధాల దృష్ట్యా 'జఫ్‌నా'ని 'మద్రాస్‌ కేఫ్'గా మార్చారు.

ఇక తాజాగా కార్తీక్ ఆర్యన్ సాజిద్‌ నదియద్‌వాలా నిర్మాణంలో సమీర్‌ విద్వాన్స్‌ దర్శకత్వంలో 'సత్యనారాయణ్‌కి కథ' సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీ టైటిల్‌ అనౌన్స్‌ చేసిన వెంటేనే వివాదాలు కూడా మొదలయ్యాయి. సంస్కృతి బచావో మంచ్ నదియద్‌వాలాపై పోలీస్ కేసు పెట్టింది. మెజార్టీ ప్రజల విశ్వాసాన్ని కించపరిచేలా ఉన్న ఈ టైటిల్‌ని తొలగించాలని ఆందోళనలు చేసింది. దీంతో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, టైటిల్ మారుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు మేకర్స్.





క‌రోనా హాట్‌స్పాట్‌గా న‌ల్గొండ స‌భ‌?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>