PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections-kcr-strategiesb2626631-fe0a-44ac-a063-3609252e6209-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections-kcr-strategiesb2626631-fe0a-44ac-a063-3609252e6209-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వివిధ నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మామూలుగా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడతారు. ఇందులో భాగంగా ఎన్నడూ చేయని సహాయ కార్యక్రమాలను సైతం చేస్తుంటారు. అయితే అందరూ అలా ఉండకపోయినా ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులు ఈ కోవకే చెందుతారు. HUJURABADH BY ELECTIONS KCR STRATEGIES{#}Elections;Telangana Rashtra Samithi TRS;Cabinet;MLA;Telangana;KCR;Partyకేసీఆర్ వ్యూహాలకు అంతే లేదా... ఆఖరికి ?కేసీఆర్ వ్యూహాలకు అంతే లేదా... ఆఖరికి ?HUJURABADH BY ELECTIONS KCR STRATEGIES{#}Elections;Telangana Rashtra Samithi TRS;Cabinet;MLA;Telangana;KCR;PartySun, 08 Aug 2021 18:00:16 GMTకోవిడ్ కారణంగా ఎంతోమంది పిల్లలు వారి తల్లితండ్రులను కోల్పోయి అందేశాలుగా మారిన విషయం తెలిసిందే. వీరికోసం అన్ని రాష్ట్రాలు ఏదో ఒక విధంగా వారిని బాగు పరిచేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ ఒకడుగు ముందుకు వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వివిధ నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మామూలుగా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడతారు. ఇందులో భాగంగా ఎన్నడూ చేయని సహాయ కార్యక్రమాలను సైతం చేస్తుంటారు. అయితే అందరూ అలా ఉండకపోయినా ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులు ఈ కోవకే చెందుతారు. కొద్ది కాలంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదనే అన్ని పార్టీల దృష్టి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ పరిస్థితి అయితే వేరే చెప్పక్కర్లేదు. ఎలా అయినా హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్.

ఇప్పటికే దళిత బంధు పథకాన్ని ప్రకటించి ప్రజల్లో మంచి పేరును పొందారు. ఇక అది చాలదన్నట్టు ఇప్పుడ సరికొత్తగా అనాధ పిల్లలను చేరదీసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.  కేసీఆర్ ఎప్పుడు ఏమి చేసినా దేశమంతా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు అనాధ పిల్లల అంశాన్ని తీసుకున్నాడు. కానీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా అదే అనాథలకు కనీసం గుర్తింపు కార్డులను కూడా జారీ చేయని దుస్థితిలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏమిటో అన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు మాత్రం ఈ ఆనాధలు అందరికీ గుర్తింపు కార్డులను ఇచ్చి  వారికి కావలసిన అన్ని సంపూర్ణ హక్కులు కల్పించాలని నిన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో దీని గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రతి పక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.  

కేసీఆర్ ప్రజలను కీలు బొమ్మలా చేస్తున్నారని, తన స్వార్థానికి ప్రతి విషయాన్ని వాడుకుంటారని విమర్శిస్తున్నారు. అయితే తన స్నేహితుడు అయిన గాదె ఇన్నయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇలా చేస్తున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.  మరికొందరు మాత్రం ఏ విధంగా అయితే ఏమిటి, అనాథలకు మంచి జరుగుతుంది కదా అని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎప్పుడైనా మంచికోసం చేసే ఏ పని వెనుక అయినా స్వార్దం దాగి ఉంటే పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా భిన్న కోణాల మధ్యన ఈ అంశంపై చర్చ విపరీతంగా జరుగుతోంది. అధికార పార్టీగా కొత్తగా ఒక ఉప ఎన్నిక కోసం ఇన్ని చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఏది ఏమైనా హుజూరాబాద్ లో ముమ్మాటికీ గెలిచేది తెరాస పార్టీ అని సొంత పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి చూద్దాం ఈ అంశం మరెన్ని వివాదాలను తీసుకువస్తుందో.



ఒక పాట ఒక వివాదం

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>