PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rajinibeb83407-f0be-4c82-957e-0daaaa971863-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rajinibeb83407-f0be-4c82-957e-0daaaa971863-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై పలు సర్వే సంస్థలు...సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎక్కువగా సర్వేలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. rajini{#}Vundavalli Sridevi;Guntur;politics;Survey;Elections;House;Chilakaluripeta;Thadikonda;Vemuru;YCPరజినికి ఊహించని షాక్...ఆ ముగ్గురికి కూడా కష్టమేనా?రజినికి ఊహించని షాక్...ఆ ముగ్గురికి కూడా కష్టమేనా?rajini{#}Vundavalli Sridevi;Guntur;politics;Survey;Elections;House;Chilakaluripeta;Thadikonda;Vemuru;YCPSun, 08 Aug 2021 00:00:00 GMTఏపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై పలు సర్వే సంస్థలు...సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎక్కువగా సర్వేలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలోనే ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం...ఇప్పటికీ ఏపీలో వైసీపీకి తిరుగులేదనే తెలుస్తోంది. కాకపోతే గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఇప్పుడు వైసీపీకి వచ్చే పరిస్తితి లేదని ఆ సర్వే చెబుతోంది. కానీ వైసీపీకి మాత్రం మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్‌ల్లో వైరల్ అవుతున్న ఆ సర్వే ప్రకారం...కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకిత ఎదురుకుంటున్నారని తెలిసింది.

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకిత పెరిగిందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గుంటూరులో 17 సీట్లు ఉంటే వైసీపీ 15 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. ఇక 15 మందిలో ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్తితి ఉందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ నలుగురు ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అలా గడ్డు పరిస్తితిని ఎదురుకుంటున్న వారిలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని కూడా ఉండటం షాకింగ్ కలిగించే అంశం. తొలిసారి చిలకలూరిపేట నుంచి గెలిచిన రజినికి రెండేళ్లలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. కానీ ప్రజల అవసరాలు తీర్చడంలో రజిని వెనుకబడి ఉన్నారని సర్వే చెబుతోంది.

రజినితో పాటు హోమ్ మంత్రి సుచరిత తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ఈమెకు కూడా నియోజకవర్గంలో వ్యతిరేకిత వస్తుందని అంటున్నారు. అలాగే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిస్తితి అయితే మరీ ఘోరంగా ఉందని చెబుతున్నారు. అటు వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జునకు అంత అనుకూల పరిస్తితులు ఉన్నట్లు కనిపించడం లేదు. మొత్తం మీద చిలకలూరిపేట, తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూల పరిస్తితులు లేవని అంటున్నారు.



రజినికి ఊహించని షాక్...ఆ ముగ్గురికి కూడా కష్టమేనా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>