MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raveendra-vijay-replaces-prakash-raj9416d56a-cf39-4734-b460-e891ed326866-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raveendra-vijay-replaces-prakash-raj9416d56a-cf39-4734-b460-e891ed326866-415x250-IndiaHerald.jpgసినిమాలలో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని ఎంతో మంది ఆర్టిస్టులు అనుకుంటూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే వారి కోరికను నెరవేర్చుకోవడంలో సక్సెస్ అవుతారు. కానీ ఇంత పెద్ద సినిమా పరిశ్రమలో అవకాశాలు అతి తక్కువగా వస్తుంటాయి. అందుకే వచ్చిన అవకాశంతో మనమంటే ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. RAVEENDRA VIJAY-REPLACES-PRAKASH RAJ{#}Ram Madhav;Maha;Doctor;2020;teja;Kannada;Kollu Ravindra;Prakash Raj;Chennai;Tamil;Darsakudu;kalyan;Success;Director;Telugu;Cinemaతెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?RAVEENDRA VIJAY-REPLACES-PRAKASH RAJ{#}Ram Madhav;Maha;Doctor;2020;teja;Kannada;Kollu Ravindra;Prakash Raj;Chennai;Tamil;Darsakudu;kalyan;Success;Director;Telugu;CinemaSun, 08 Aug 2021 19:17:21 GMTసినిమాలలో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని ఎంతో మంది ఆర్టిస్టులు అనుకుంటూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే వారి కోరికను నెరవేర్చుకోవడంలో సక్సెస్ అవుతారు. కానీ ఇంత పెద్ద సినిమా పరిశ్రమలో అవకాశాలు అతి తక్కువగా వస్తుంటాయి. అందుకే వచ్చిన అవకాశంతో మనమంటే ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎంతోమంది ఒక్క పాత్ర తోనే డైరెక్టర్ లకు మంచి ఛాయిస్ లుగా మారిపోతుంటారు. ప్రస్తుతం ఒక కన్నడ నటుడు తెలుగులో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అవ్వడానికి తన వంతు ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నాడు. రవీంద్ర విజయ్ పుట్టింది పెరిగింది కర్ణాటకలోని బెంగళూర్ లో... తెలుగు, తమిళ్ మరియు ఇంగ్లీష్ భాషలను సంపూర్ణంగా మాట్లాడగలడు. ఇతను స్వతహాగా డాక్టర్ అయినప్పటికీ నటనపై తనకున్న ప్రత్యేక శ్రద్ద కారణంగా తన డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి 2010 సంవత్సరంలోనే తమిళనాడుకు చేరుకున్నాడు.
రవీంద్ర విజయ్ చిన్న చిన్న పాత్రలను చేసుకుంటూ వచ్చాడు. 2016 సంవత్సరంలో రెండు  సినిమాలలో నటించినా అంత పేరు రాలేదు. ఆ తరువాత 2018 సంవత్సరంలో తమిళ చిత్రం "ఒడు రాజ ఒడు" లో నాజర్ కు సోదరుడి పాత్రలో నటించడానికి ఆఫర్ వచ్చింది. ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకు వచ్చింది. తద్వారా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మించిన "కదరం కొండన్" మరియు "ధరల ప్రభు" చిత్రాలలో నటించాడు. ఇలా తన నటనా జీవితం కొనసాగుతుండగా 2020 వ సంవత్సరంలో  ప్రముఖ తెలుగు నటుడు సత్యదేవ్ ప్రధానపాత్రలో నటించిన "ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య" చిత్రంలో నటించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సినిమాలో జోగ్ నాథ్ అనే విలన్ పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఇది విమర్శకులను సైతం మెప్పించడంలో సక్సెస్ అయింది.
 ఈ సినిమాను కేర్ ఆఫ్ కంచర్లపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించాడు. ఈ చిత్రంలో తన నటనకు గానూ ప్రముఖ వెబ్ సెరీస్ "ది ఫ్యామిలీ మాన్ 2" లో చెన్నై ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్ర కూడా అతనికి మరిన్ని అవకాశాలు రావడంలో హెల్ప్ అయిందని చెప్పవచ్చు. తాజాగా తేజ సజ్జ హీరోగా నటించిన ఇష్క్ మూవీలో మాధవ్ అనే పాత్రలో నటించాడు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోయింది. ప్రస్తుతానికి అయితే రెండు సినిమాలు ఇతని లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మూవీలో కూడా ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వార్త ఇంకా రాలేదు. మరి రవీంద్ర విజయ్ త్వరలోనే తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడతాడా అన్నది కాలమే సమాధానం చెబుతుంది. ఇతని నటన చూస్తే తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ లా ఉన్నాడని సినిమా వర్గాలు అంటున్నాయి.
 


కేసీఆర్ ది ఎలక్షన్ డ్రామా అంటున్న రేవంత్

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>