PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/educationb7c2c412-5c31-4d65-88b3-af09032ed9b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/educationb7c2c412-5c31-4d65-88b3-af09032ed9b8-415x250-IndiaHerald.jpg ప్ర‌స్తుత ప్ర‌పంచంలో అన్ని డిజిట‌ల్ మ‌యం అయిపోయాయి. పెరుగుతున్న సాంకేతిక‌త‌తో ప్ర‌తి ఇంట్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్ని ఆన్‌లైన్‌లో శోధించి తెలుసుకుంటున్నారు. అస‌లు ఈ గ్లోబ‌లైజేష‌న్ ప్ర‌పంచంలో డిజిట‌లైజేష‌న్ జ‌రుగ‌కుంటే న‌డిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. విద్యా , వైద్యం, అమ్మ‌కాలు, కొనుగోళ్లు, ప‌రిశోధ‌న‌లు అన్ని ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత ఇది ఇంకా ఎక్కువై పోయింది. పిల్ల‌ల‌కు విద్యాబోధ‌న ఆన్ లైన్ ద్వారా జ‌రుగుతున్న ప‌రిస్థితినిdigitalized education{#}vidya;Telangana;central governmentఇక డిజిట‌ల్ లోనే విద్యా భోద‌న‌.!ఇక డిజిట‌ల్ లోనే విద్యా భోద‌న‌.!digitalized education{#}vidya;Telangana;central governmentSun, 08 Aug 2021 11:20:00 GMT  ప్ర‌స్తుత ప్ర‌పంచంలో అన్ని డిజిట‌ల్ మ‌యం అయిపోయాయి. పెరుగుతున్న సాంకేతిక‌త‌తో ప్ర‌తి ఇంట్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్ని ఆన్‌లైన్‌లో శోధించి తెలుసుకుంటున్నారు. అస‌లు ఈ గ్లోబ‌లైజేష‌న్ ప్ర‌పంచంలో  డిజిట‌లైజేష‌న్ జ‌రుగ‌కుంటే న‌డిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. విద్యా , వైద్యం, అమ్మ‌కాలు, కొనుగోళ్లు, ప‌రిశోధ‌న‌లు అన్ని ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత ఇది ఇంకా ఎక్కువై పోయింది. 



పిల్ల‌ల‌కు విద్యాబోధ‌న ఆన్ లైన్ ద్వారా జ‌రుగుతున్న ప‌రిస్థితిని గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా మ‌నం చూస్తూనే ఉంటున్నాం. ఇదే క్ర‌మంలో విద్యాబోధ‌న‌ను డిజిట‌లైజేష‌న్ చేసేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఒక అడుగు ముందుకు వేశాయి. అయితే సెల్‌ఫోన్‌లలో కంటే డిజిట‌ల్ బోర్డుల‌పై నాణ్య‌మైన విద్య‌ను అందించవ‌చ్చున‌ని భావిస్తున్నాయి. ఒక వేళ క‌రోనా ప్ర‌భావం ముగిసిపోయ‌న త‌రువాత కూడా డిజిట‌ల్ బోర్డుల ద్వాదా విద్య‌ను అందించ‌వ‌చ్చు అని అనుకుంటున్నారు.


బ్లాక్ బోర్డుల‌పై బొమ్మ‌లు గీసి పిల్ల‌ల‌కు వివ‌రించ‌డం కంటే డిజిట‌ల్ బోర్డుల ద్వారా విద్యార్థుల‌కు సులువుగా అర్థ‌మ‌య్యే విధంగా భోదించ‌వ‌చ్చు. ఎక్కువ స‌మాచారాన్ని బొమ్మ‌ల రూపంలో పిల్ల‌కు చెప్ప‌వ‌చ్చ‌ని, దీని ద్వారా ఉపాధ్యాయుల‌కు కూడా సుల‌భం అవుతుంది.  మ‌రోవైపు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల వైపు  విద్యార్థుల‌ను మ‌ళ్లించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఆలోచిస్తుంది. దీని కోసం 2020-2021 విద్యాసంవ‌త్సారానికి సంబంధించి తెలంగాణ‌లోని 2000 పాఠ‌శాల‌ల్లో డిజిట‌ల్ బోర్డ్‌ల‌ను ఏర్ప‌టు చేసేందుకు 60ః 40 నిష్ప‌త్తిలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు డ‌బ్బులు కేటాయించాయి. దీని వ‌ల్ల పేద విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందుతుంది.


అయితే ప్రైవేట్ పాఠ‌శాల‌లకు ఇది పోటీ అవుతుంది. దీని వ‌ల్ల ఆ పాఠ‌శాల‌లు కూడా డిజిట‌ల్ వైపు అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి త‌మ పిల్ల‌ల్ని చ‌దిపిస్తుండ‌డం తో వారు కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో కంటే మంచి విద్య అందించాల‌ని కోరుకుంటారు. దీంతో ప్రైవేట్ పాఠ‌శాల‌లు కూడా డిజిట‌ల్ వైపు మ‌ళ్లాల్సి ఉంటుంది. ఏది ఏమైనా దీని ద్వారా విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందుతుంది.





సినిమాల కోసం బరువు పెరిగిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>