PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ycp-war-words-behind-secret8df239a9-8af7-42f8-862c-57b754667d7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ycp-war-words-behind-secret8df239a9-8af7-42f8-862c-57b754667d7a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ప్రతిపక్షాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో ఆదేశించిందే తడవుగా బయటకు వచ్చి మంత్రి పేర్ని నాని బీజేపీపై విరుచుకుపడగా, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా స్వరం పెంచారు. వెనువెంటనే బీజేపీ నేతలు కూడా ట్విట్టర్లో, మీడియా మైకుల ముందు ప్రతిస్పందించారు. అత్యంత మృదువుగా, సుతిమెత్తగా కొనసాగుతున్న ఈ విమర్శలు, ప్రతి విమర్శల పర్వం లాలూచీ కుస్తీని తలపిస్తుందని ప్రతిపక్షాలు BJP YCP WAR Words behind secret{#}Tadepalli;Friday;YCP;Bharatiya Janata Party;Nani;Telangana Chief Minister;Party;CM;media;Ministerబీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధంలో ఆంతర్యం!బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధంలో ఆంతర్యం!BJP YCP WAR Words behind secret{#}Tadepalli;Friday;YCP;Bharatiya Janata Party;Nani;Telangana Chief Minister;Party;CM;media;MinisterSun, 08 Aug 2021 12:05:00 GMTఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ప్రతిపక్షాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో ఆదేశించిందే తడవుగా బయటకు వచ్చి మంత్రి పేర్ని నాని బీజేపీపై విరుచుకుపడగా, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా స్వరం పెంచారు. వెనువెంటనే బీజేపీ నేతలు కూడా ట్విట్టర్లో, మీడియా మైకుల ముందు ప్రతిస్పందించారు. అత్యంత మృదువుగా, సుతిమెత్తగా కొనసాగుతున్న ఈ విమర్శలు, ప్రతి విమర్శల పర్వం లాలూచీ కుస్తీని తలపిస్తుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

అసలే ఆర్ధిక అగచాట్లు, చుట్టుముడుతున్న సమస్యలు, పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో.. సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడికి వస్తున్న అసంతృప్తి వర్గాలు... ఇలా ఊపిరాడని పరిస్థితుల్లో ఉక్కపోతతో అల్లాడుతున్న అధికార వైసీపీకి ఆర్ధిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. నవరత్నాల పేరిట పంచేందుకు డబ్బు లేక అప్పుల కోసం అర్రులు చాస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మోకాలడ్డింది. వివరణలు అడుగుతుంది. దీంతో వైసీపీ ప్రభుత్వంలోని కొంతమంది నేతలకు బీజేపీ వ్యవహారశైలి అస్సలు నచ్చడం లేదు. అయితే బయటకు మాత్రం  ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇదే అదనుగా బీజేపీ నేతలు కొంతమంది ట్విట్టర్లో వైసీపీపై చణుకులు విసురుతున్నారు. నిన్న, మొన్నటి వరకు వైసీపీతో పాటు, టీడీపీని కలిపి విమర్శించిన బీజేపీ నేతలు ప్రస్తుతం కాస్తంత స్వరం మార్చారు. తాజాగా వైసీపీపై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. అందుకనే శుక్రవారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో బీజేపీ నేతలు ఎవరైనా మాట్లాడితే.. కౌంటర్ చేయాలని సీఎం మంత్రులకు క్లాస్ పీకారు. దీంతో క్యాబినేట్ సమావేశం ముగిసిన వెంటనే జరిగిన మీడియా బ్రీఫింగ్‌లో మంత్రి పేర్ని నాని బీజేపీపై విరుచుకు పడ్డారు. కాషాయం కండువా వేసుకున్న బాబాని తీసుకువచ్చి కూర్చోబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.  


ఆ మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కూడా స్వరం పెంచి మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం వైసీపీ విమర్శలపై ట్విట్టర్లోనూ, మీడియా మైకుల ముందు స్పందించారు. "అప్పులు పుట్టక, బెయిల్‌ ఎప్పుడు రద్దు అవుతుందో తెలియక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి, అది చాలదన్నట్లుగా వేల కోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు" అని ఢిల్లీకి చెందిన ఓ నేత ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇలా ఎవరైతే వైసీపీకి సన్నిహితంగా ఉంటారని పేరున్న నేతలు బీజేపీలో ఉన్నారో.. తాజాగా వారే ఆ పార్టీకి వ్యతిరేకంగా స్పందించడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ఇదంతా లాలూచీ కుస్తీఅని కొందరు వామపక్ష నేతలు వ్యాఖ్యానించారు. నువ్వు కొట్టినట్లు, నేను ఏడ్చినట్లు ఉండాలనే సామెతను తలపిస్తోందని విమర్శిస్తున్నారు.



సినిమాల కోసం బరువు పెరిగిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>