Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/olympics-9c86c596-6b80-4770-85ed-71a4356be1c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/olympics-9c86c596-6b80-4770-85ed-71a4356be1c2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జరుగుతున్న క్రీడల పండుగ ఒలంపిక్స్లో భారత్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే పలు విభాగాల్లో ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారులు భారత్ తరఫున పతకాలు సాధించి ఇక త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశారు. కొంతమంది రజత పథకాలను సాధిస్తే కొంతమంది కాంస్య పతకాలు సాధించారు. ఏకంగా వందేళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత్ తరఫున స్వర్ణం సాధించిన ఆటగాడిగా ఇటీవలే నీరజ్ చోప్రా కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇలా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఒలింపిక్స్లో పాల్గొని భారత తరపున పతకం సాధించి భారతOlympics {#}festival;indigo airlines;gold;Gift;India;central governmentబంపర్ ఆఫర్.. టోక్యో విజేతలకు జీవితాంతం ఫ్రీ?బంపర్ ఆఫర్.. టోక్యో విజేతలకు జీవితాంతం ఫ్రీ?Olympics {#}festival;indigo airlines;gold;Gift;India;central governmentSun, 08 Aug 2021 18:50:00 GMTప్రస్తుతం జరుగుతున్న క్రీడల పండుగ ఒలంపిక్స్లో భారత్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే పలు విభాగాల్లో ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారులు భారత్ తరఫున పతకాలు సాధించి ఇక త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశారు. కొంతమంది రజత పథకాలను సాధిస్తే కొంతమంది కాంస్య పతకాలు సాధించారు. ఏకంగా వందేళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత్ తరఫున స్వర్ణం సాధించిన ఆటగాడిగా ఇటీవలే నీరజ్ చోప్రా కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.  ఇలా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఒలింపిక్స్లో పాల్గొని భారత తరపున పతకం సాధించి భారత గౌరవాన్ని నిలబెట్టిన క్రీడాకారులకు  ప్రస్తుతం దేశం అరుదైన గౌరవం ఇస్తుంది.



 ఇలా ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తంలో నజరానా ఇస్తూ ఉండగా ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ మొత్తంలో ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు నజరానా ప్రకటిస్తున్నాయి.  అంతేకాకుండా ఇక అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా క్రీడాకారులకు అందిస్తున్నాయి. ఇలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఒలంపిక్స్ లో క్రీడాకారులకు ఎన్నో నజరానాలు  ప్రకటించాయి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఒలంపిక్స్లో దేశం తరఫున పథకాలు సాధించిన క్రీడాకారులను గౌరవిస్తూ పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కాగా ఒలింపిక్స్ లో భారత్ తరఫున పథకాలు సాధించిన క్రీడాకారులు తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్లు ఇటీవలే దేశీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ పోర్ట్, గో ఫస్ట్ విమానయాన సంస్థలు ప్రకటించాయి.



 అయితే ఇలా కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాయి అనుకుంటే పొరపాటే.. క్రీడాకారులు జీవితకాలమంతా ఉచితంగా తమ విమానాలలో ప్రయాణించవచ్చు అంటూ ఇటీవలే స్టార్ ఎయిర్ విమానయాన సంస్థ తెలిపింది. మరో దేశీయ విమానయాన సంస్థ అయిన గో ఫస్ట్  ఐదేళ్లపాటు క్రీడాకారులు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇక అదే సమయంలో దేశానికి స్వర్ణ పతకాన్ని సాధించి త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన నీరజ్ చోప్రా కి ఏడాది పాటు ఉచిత ప్రయాణ సేవలు అందిస్తామని ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.



ఆరెస్పీ ప్రశ్న: కారు కిందపడతారా.. ఏనుగు ఎక్కుతారా..?

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>