MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr-kalyanamandapam-0f836f05-bf1b-4a71-8d25-2db0c0030a39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr-kalyanamandapam-0f836f05-bf1b-4a71-8d25-2db0c0030a39-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంతో సినిమాలు రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. గత శుక్రవారం ఒకేసారి ఐదు సినిమాలు విడుదల కాగా... ఈ శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఇన్ని సినిమాలు విడుదలైనప్పటికీ అందులో ఒకే ఒక్క సినిమా హిట్ గా నిలిచింది. గత రెండు వారాల్లో రిలీజైన చిత్రాల్లో ఆ ఒక్క సినిమానే మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అదే "ఎస్ఆర్ కళ్యాణమండపం". ఆగస్టు 6న విడుదల ఈ మూవీ మొదటి రోజే ఆంధ్ర, తెలంగాణలో కలిపి రూ.1.23 కోట్లు వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు మొత్తంSR Kalyanamandapam;{#}kiran;krishna;teja;Andhra Pradesh;court;Audience;Friday;Coronavirus;Guntur;House;Cinemaసెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ హిట్... బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ హిట్... బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్SR Kalyanamandapam;{#}kiran;krishna;teja;Andhra Pradesh;court;Audience;Friday;Coronavirus;Guntur;House;CinemaSun, 08 Aug 2021 08:06:00 GMTకరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంతో సినిమాలు రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. గత శుక్రవారం ఒకేసారి ఐదు సినిమాలు విడుదల కాగా... ఈ శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఇన్ని సినిమాలు విడుదలైనప్పటికీ అందులో ఒకే ఒక్క సినిమా హిట్ గా నిలిచింది. గత రెండు వారాల్లో రిలీజైన చిత్రాల్లో ఆ ఒక్క సినిమానే మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అదే "ఎస్ఆర్ కళ్యాణమండపం". ఆగస్టు 6న విడుదల ఈ మూవీ మొదటి రోజే ఆంధ్ర, తెలంగాణలో కలిపి రూ.1.23 కోట్లు వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు మొత్తంగా రూ.2.35 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. నిజానికి కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూడడానికి అసలు ఆసక్తి చూపిస్తారా? లేదా ? అనుకున్న తరుణంలో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలయ్యాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది సత్యదేవ్ కోర్టు డ్రామా "తిమ్మరుసు" గురించి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటగా విడుదలైన సినిమాలలో ఈ సినిమాకే కాస్త బజ్ ఉంది. రిలీజ్ తర్వాత ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక దీనితో పాటు విడుదలైన తేజ సజ్జ  'ఇష్క్' ఆకట్టుకోలేకపోయింది. ఈ వారం ఏడు సినిమాలు విడుదల అయినప్పటికీ అందులో కిరణ్ అబ్బవరం "ఎస్ ఆర్ కళ్యాణమండపం" సినిమా మంచి హైప్ తో ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ థియేటర్స్ మాత్రం హౌస్ ఫుల్ అవుతున్నాయి. నైజాం ఏరియాలో అయితే ఏకంగా బ్రేక్ ఈవెన్ వసూళ్లు సాధించడం విశేషం. మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన చిత్రాలలో "ఎస్ఆర్ కళ్యాణమండపం" ఫస్ట్ హిట్ కొట్టి విజేతగా నిలిచింది. దీంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీగా ఉంది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ కలెక్షన్లు చూస్తే... ఆంధ్రప్రదేశ్ / తెలంగాణలోనో మొత్తం వసూళ్లు కలిపి రూ. 1.23 కోట్లు, మొత్తం గ్రాస్ రూ. 2.35 కోట్లు.  

ఉత్తరాంద్ర రూ. 0.13 కోట్లు
గుంటూరు రూ. 0.13 కోట్లు
ఈస్ట్ రూ. 0.08 కోట్లు
వెస్ట్ రూ. 0.06 కోట్లు
కృష్ణ రూ.0.06 కోట్లు
నెల్లూరు రూ.0.04 కోట్లు
నైజాం రూ. 0.48 కోట్లు
సీడెడ్ రూ.0.25 కోట్లు
మొత్తం వసూళ్లురూ. 1.23 కోట్లు



కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ లో కొత్త గొడవలు..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>